Share News

Mandal Parishads మండల పరిషత్‌లకు ప్రత్యేకాధికారుల నియామకం

ABN , Publish Date - Sep 24 , 2026 | 12:05 AM

Appointment of Special Officers for Mandal Parishads జిల్లాలో ఎంపీపీలతో పాటు ఎంపీటీసీల పదవీ కాలం బుధవారం ముగిసింది. దీంతో పంచాయతీరాజ్‌ చట్టం 1984లోని సెక్షన్‌ 250 ఏ (1) ప్రకారం మండల పరిషత్‌లకు ప్రత్యేక అధికారులను నియమించారు. ఇక గురువారం నుంచి ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభం కానుంది. ఆరు నెలల వరకు వారి పాలన ఉంటుంది. ఈలోగా స్థానిక ఎన్నికలు జరిగితే తిరిగి ప్రజాప్రతినిధులు కొలువుదీరనున్నారు.

 Mandal Parishads మండల పరిషత్‌లకు ప్రత్యేకాధికారుల నియామకం
పార్వతీపురం మండల పరిషత్‌ కార్యాలయం

పార్వతీపురం, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎంపీపీలతో పాటు ఎంపీటీసీల పదవీ కాలం బుధవారం ముగిసింది. దీంతో పంచాయతీరాజ్‌ చట్టం 1984లోని సెక్షన్‌ 250 ఏ (1) ప్రకారం మండల పరిషత్‌లకు ప్రత్యేక అధికారులను నియమించారు. ఇక గురువారం నుంచి ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభం కానుంది. ఆరు నెలల వరకు వారి పాలన ఉంటుంది. ఈలోగా స్థానిక ఎన్నికలు జరిగితే తిరిగి ప్రజాప్రతినిధులు కొలువుదీరనున్నారు. కాగా బలిజిపేట మండలానికి గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ బి.వెంకటరమణ, గుమ్మలక్ష్మిపురం ఐసీడీఎస్‌ పీడీ టి.కనకదుర్గ, గరుగుబిల్లి జిల్లా సహకార అఽధికారి ఎం.వాణిశైలజ, జియ్యమ్మవలస మెప్మా పీడీ బి.వి.నాగభూషణరావు, కొమరాడ మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజ్‌ వై.కమల, కురుపాం మండలానికి జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె.సాయికృష్ణచైతన్య ప్రత్యేకాధికారులుగా నియామక మయ్యారు. మక్కువకు జిల్లా ఉద్యాన శాఖాధికారి కె.సత్యనారాయణరెడ్డి, పాచిపెంటకు మైక్రో ఇరిగేషన్‌ జిల్లా అధికారి వి.రాధాకృష్ణ, పార్వతీపురం డీఆర్‌డీఏ పీడీ ప్రభావతి, సాలూరు సివిల్‌ సప్లైస్‌ మేనేజర్‌ బి.బాలజీరామ్‌, భామినికి ఐటీడీఏ హార్టికల్చర్‌ అధికారి గణేష్‌, పాలకొండ మండలానికి పశుసంవర్థకశాఖ జేడీ దినకుమార్‌, సీతంపేట కేఆర్‌సీ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ధర్మరాజు, వీరఘట్టం మండలానికి లేబర్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ పి.సువర్ణను నియమించారు.

స్థానిక సంస్థల్లో ముగిసిన వైసీపీ పాలన

జిల్లాలోని స్థానిక సంస్థల్లో వైసీపీ ప్రజాప్రతినిఽధు లందరూ మాజీలు అయ్యారు. ఇప్పటికే ఎంపీపీలు, ఎంపీటీసీల సభ్యుల పదవీకాలం ముగియగా.. గురువారంతో జడ్పీటీసీ సభ్యులు కూడా మాజీలుగా మారనున్నారు. ఇప్పటికే సాలూరు, పార్వతీపురం పురపాలక సంఘాల్లో వైసీపీ కౌన్సిలర్లు మాజీలయ్యారు. పాలకొండ నగర పంచా యతీలో మాత్రం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి కూటమి పార్టీలు చైర్‌పర్సన్‌ కుర్చీని కైవసం చేస్తున్నాయి. మెజార్టీ సభ్యులు వైసీపీకి ఉన్నా.. రిజర్వేషన్‌ కారణంగా చైర్‌పర్సన్‌ కుర్చీని ఆ పార్టీ కోల్పోయింది. కాగా పదవీకాలం ముగిసిన తర్వాత ఆ నగర పంచాయతీ పరిధిలో ఉన్న కౌన్సిలర్లు కూడా మాజీలయ్యారు. 2021లో వైసీపీ సర్కారు హయాంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో 15 ఎంపీటీసీ, జడ్పీటీసీ ఆ పార్టీ మద్దతుదారులే కైవసం చేసుకున్నారు. దీంతో ఉమ్మడి విజయనగరం జడ్పీ పీఠం కూడా ఆ పార్టీ దక్కించుకుంది. ప్రస్తుత ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్‌ చిన్నశ్రీను వైసీపీ నుంచి ఎన్నికైనా.. ఇటీవల టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఆయన కూడా నేటితో మాజీ చైర్మన్‌గా మారనున్నారు.

Updated Date - Sep 24 , 2026 | 12:05 AM