ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ
ABN , Publish Date - May 02 , 2026 | 12:16 AM
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ పరిధిలోని నూజివీడు, ఆర్కేవ్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్టు అడ్మిషన్ల కన్వీనర్ డాక్టర్ అమ రేంద్ర కుమార్ తెలిపారు.
నూజివీడు టౌన్, మే 1(ఆంధ్రజ్యోతి): రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ పరిధిలోని నూజివీడు, ఆర్కేవ్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్టు అడ్మిషన్ల కన్వీనర్ డాక్టర్ అమ రేంద్ర కుమార్ తెలిపారు. పదవ తరగతి ఫలితాలు విడుదలైన నేపథ్యంలో ప్రవేశాల ప్రక్రి యను వేగవంతం చేస్తూ షెడ్యూల్ ప్రకటించారు. ఈనెల ఒకటో తేదీ నుంచి 30 వరకు దరఖాస్తుల స్వీకరణ, జూన్ 12 తేదీ మెరిట్ లిస్టును విడుదల చేస్తామన్నారు. కౌన్సెలింగ్ అనంతరం జూలై ఒకటో తేదీ నుంచి తరగ తులు ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఇతర వివరాలకు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ లో పరిశీలించాలని సూచించారు.