Share News

అప్పారావుకు రూ.3 లక్షల ఆర్థికసాయం

ABN , Publish Date - Feb 20 , 2026 | 12:13 AM

గత ఏడాది తమిళనాడులో శివగంగ ప్రాంతంలో వెట్టిచాకిరి నుంచి విముక్తి పొందిన అప్పారావు కుటుం బానికి రూ.3 లక్షల విలువైన బాండ్లను కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి గురువారం కలెక్టరేట్‌లో అందజేశారు.

అప్పారావుకు రూ.3 లక్షల ఆర్థికసాయం
కలెక్టర్‌ నుంచి బాండ్లు అందుకుంటున్న అప్పారావు

పార్వతీపురం, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): గత ఏడాది తమిళనాడులో శివగంగ ప్రాంతంలో వెట్టిచాకిరి నుంచి విముక్తి పొందిన అప్పారావు కుటుం బానికి రూ.3 లక్షల విలువైన బాండ్లను కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి గురువారం కలెక్టరేట్‌లో అందజేశారు. గతేడాది అప్పారావును వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించి నప్పటికీ రావాల్సిన ఆర్థికసాయం సాంకేతిక కారణాలు వల్ల నిలిచిపోయింది. ఎట్టకేలకు తమిళనాడు నుంచి అప్పారావుకు అందాల్సిన ఆర్థిక సాయం అందింది. లేబర్‌ డిపార్ట్‌మెంట్‌తో పాటు నేచర్‌ ఎన్‌జీవో, ఐజేఎం సంస్థల ప్రతినిధులు ఏడాది పాటు నిరంతరంగా కృషి చేసి తమిళనాడులోని శివగంగా బ్రాంచ్‌ నుంచి నిధులను పార్వతీపురం బ్రాంచ్‌కు బదిలీ చేయించారు. వీరి ప్రయత్నాన్ని కలెక్టర్‌ ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2026 | 12:13 AM