Share News

ఎరువుల పారదర్శక పంపిణీకే ‘ఏపీఏఐఎంఎస్‌’

ABN , Publish Date - Jun 09 , 2026 | 12:06 AM

రైతులకు మరింత పారదర్శకంగా ఎరువులు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అగ్రికల్చరల్‌ ప్రొడ్యూస్‌ అండ్‌ ఇన్‌పు ట్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌(ఏపీఏఐఎంఎస్‌)ను అమలు చేస్తోందని జిల్లా వ్యవసాయ శాఖాధికారి వీటీ రామా రావు తెలిపారు.

ఎరువుల పారదర్శక పంపిణీకే ‘ఏపీఏఐఎంఎస్‌’

  • జిల్లా వ్యవసాయ అధికారి రామారావు

మెరకముడిదాం, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): రైతులకు మరింత పారదర్శకంగా ఎరువులు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అగ్రికల్చరల్‌ ప్రొడ్యూస్‌ అండ్‌ ఇన్‌పు ట్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌(ఏపీఏఐఎంఎస్‌)ను అమలు చేస్తోందని జిల్లా వ్యవసాయ శాఖాధికారి వీటీ రామా రావు తెలిపారు. మండలంలోని గర్భాం రైతుసేవా కేం ద్రాన్ని ఆయన సోమవారం సందర్శించారు. ఈసంద ర్భంగా ఆయన రైతులకు యూరియా కార్డులను పంపి ణీ చేశారు. అనంతరం ఆయన ఏపీఏఐఎంఎస్‌లో అమ లు చేస్తున్న యూరియా డిస్ర్టిబ్యూషన్‌ మాడ్యూల్‌ పని తీరును పరిశీలించి.. సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. రైతుల వివరాలు, భూమి వివ రాలు, యూరియా పంపిణీ నమోదు ప్రక్రియలను పరి శీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి వ్యవసాయ సహాయ సంచాలకుడు కోటేశ్వరరావు, వ్వవసాయ విస్తరణాధికారులు సుధీర్‌, మాధవి, రైతుసేవా కేంద్రం సిబ్బంది, రైతులు పాల్గొ న్నారు.

నెల్లిమర్ల, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): సతివాడ లోని శ్రీవెంకటేశ్వర ట్రేడర్స్‌ ఎరువుల దుకాణాన్ని జిల్లా వ్యవసాయ అధికారి వీటీ రామారావు సోమవారం తని ఖీ చేశారు. డీలర్‌ లాగిన్‌లో నూతన యూరియా విక్ర య మాడ్యూల్‌ పనితీరును పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా ఎరువు లు అందించాలని అధికారులను, డీలర్లను ఆదేశించారు. ఏడీఏ ఎన్‌.కోటేశ్వరరావు, ఏవో పి.శ్రీలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Jun 09 , 2026 | 12:06 AM