Farmers అన్నదాతల్లో గుబులు
ABN , Publish Date - Jan 12 , 2026 | 12:27 AM
Anxiety Among Farmers నైరుతి బంగళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయు గుండం ప్రభావంతో ఆదివారం జిల్లాలో మబ్బుల వాతావరణం నెలకొంది. కొన్నిచోట్ల ఆకాశం మేఘావృతమవగా.. వీరఘట్టం, సీతంపేట తదితర మండలాల్లో ఆదివారం చినుకులు పడ్డాయి. దీంతో రైతులు ఉలిక్కిపడ్డారు..
కల్లాల్లో ధాన్యం నిల్వలు
వాటిని కాపాడుకునే పనిలో రైతులు
పాలకొండ, జనవరి11(ఆంధ్రజ్యోతి): నైరుతి బంగళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయు గుండం ప్రభావంతో ఆదివారం జిల్లాలో మబ్బుల వాతావరణం నెలకొంది. కొన్నిచోట్ల ఆకాశం మేఘావృతమవగా.. వీరఘట్టం, సీతంపేట తదితర మండలాల్లో ఆదివారం చినుకులు పడ్డాయి. దీంతో రైతులు ఉలిక్కిపడ్డారు.. జిల్లాపై వాయుగుండం ప్రభావం ఉండదని వాతావరణశాఖ ప్రకటించినా.. చల్లిగాలులు, చిరు జల్లులకు అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా పత్తి, వరి పంటను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఇదిలా ఉండగా.. వివిధ కారణాలతో జిల్లాలో మిల్లర్లు గత పది రోజులుగా ధాన్యం సేకరించడం లేదు. దీంతో రైతులు నూర్పులు చేపట్టి కల్లాల్లో ఉంచిన ధాన్యం నిల్వలపై టార్పాలిన్లు కప్పి.. కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఎఫ్‌సీఐ గోడౌన్లు ఖాళీ లేక.. మిల్లింగ్ నిలిచింది. దీంతో రైస్ మిల్లుల వద్ద ఉన్న ధాన్యం, బియ్యం నిల్వలు వర్షాలకు పాడవకుండా సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. ఇక పత్తి రైతులు పరుగు పరుగున పొలాలకు వెళ్లి పంటను సేకరిస్తున్నారు. ఏదేమైనా సంక్రాంతి పండుగ వేళ వాతావరణంలో మార్పు రావడంతో రైతులు టెన్షన్ పడుతున్నారు.