Share News

Marathon Run మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా మారథాన్‌ రన్‌

ABN , Publish Date - Jan 04 , 2026 | 12:25 AM

Anti-Drug Marathon Run మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా గుమ్మలక్ష్మీపురం పోలీసుల ఆధ్వర్యంలో శనివారం మూడు కిలోమీటర్ల మేర మారథాన్‌ రన్‌ నిర్వహించారు. పాలకొండ డీఎస్‌పీ రాంబాబు జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

 Marathon Run మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా మారథాన్‌ రన్‌
మారథాన్‌ రన్‌ లో పాల్గొన్న విద్యార్థులు,పోలీసులు

కురుపాం, జనవరి3(ఆంధ్రజ్యోతి): మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా గుమ్మలక్ష్మీపురం పోలీసుల ఆధ్వర్యంలో శనివారం మూడు కిలోమీటర్ల మేర మారథాన్‌ రన్‌ నిర్వహించారు. పాలకొండ డీఎస్‌పీ రాంబాబు జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎల్విన్‌పేట నుంచి ఎస్‌.కె.పాడు గ్రామం వరకు సాగిన ఈ రన్‌లో భారీగా విద్యార్థులు పాల్గొన్నారు. డ్రగ్స్‌ వద్దు బ్రో అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. అనంతరం ఎస్‌కే పాడులో ప్రజలకు మాదకద్రవ్యాల వినియోగంతో కలిగే అనర్థాలు, చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీఐలు తిరుపతిరావు, హరి, ఎస్‌ఐలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2026 | 12:25 AM