Share News

గంజాయి కేసులో మరో విద్యార్థి

ABN , Publish Date - May 23 , 2026 | 11:59 PM

రాజాంలోని ఓ ప్రభుత్వ హాస్టల్‌లో కొంతమంది విద్యార్థులకు కొన్నాళ్లుగా గంజాయి సరఫరా చేస్తున్న మైనర్‌ విద్యార్థి ని రాజాం రూరల్‌ సీఐ ఉపేంద్ర సారధ్యంలో సంతకవి టి పొలీసులు శనివారం చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.

గంజాయి కేసులో మరో విద్యార్థి

  • చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు

  • ఏడుకు చేరిన అరెస్టులు

  • మరో వ్యక్తి పేరు బయటకు వచ్చిన వైనం

రాజాం రూరల్‌, మే 23(ఆంధ్రజ్యోతి): రాజాంలోని ఓ ప్రభుత్వ హాస్టల్‌లో కొంతమంది విద్యార్థులకు కొన్నాళ్లుగా గంజాయి సరఫరా చేస్తున్న మైనర్‌ విద్యార్థి ని రాజాం రూరల్‌ సీఐ ఉపేంద్ర సారధ్యంలో సంతకవి టి పొలీసులు శనివారం చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. రాజాం రూరల్‌ సీఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇప్పటికే గంజాయి సేవిస్తున్న ఆరుగు రిని పోలీసులు అదుపులోనికి తీసుకుని అరెస్టు చేశారు. వారి నుంచి సేకరించిన సమాచారం మేరకు.. గంజా యి సరఫరా చేస్తున్నది పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన మైనర్‌ విద్యార్థిగా పొలీసులు గుర్తించారు. అదుపులో ఉన్న ఆరుగురిలో కొంతమందితో గంజాయి సరఫరాదారుడికి గంజాయి కావాలని ఫోన్‌ చేయించా రు. దీంతో ఆ విద్యార్థి కొంత గంజాయిని తీసుకుని శనివారం సంతకవిటి మండలం జీఎస్‌ పురం ప్రాంతా నికి చేరుకున్నాడు. అప్పటికే మాటువేసిన పొలీసులు ఆ విద్యార్థిని అదుపులోనికి తీసుకున్నారు. అతని నుంచి 1200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకూ పొలీసుల అదుపులో ఉన్న ఏడుగురిలో ఆరుగురు విద్యార్థులే. వీరిలో నలుగురు మైనర్లు కాగా, ముగ్గురు మేజర్లు. పోలీసుల దర్యాప్తులో భాగంగా మ రోవ్యక్తి పేరు కూడా బయటకు వచ్చింది. అతనిని అదు పులోనికి తీసకునేందుకు పొలీసులు చర్యలు ప్రారంభిం చారు. అతడిని పొలీసులు అదుపులోనికి తీసుకుంటే మరింత మంది విద్యార్థుల పేర్లు బయటకు వచ్చే అవ కాశాలున్నాయి.

సిమ్మపేటలో పోలీసుల అదుపులో ఆరుగురు

భోగాపురం, మే 23(ఆంధ్రజ్యోతి): భోగాపురం పం చాయతీ సిమ్మపేట పరిధిలోని ఓ లేఅవుట్‌లో శనివా రం గంజాయి సేవిస్తున్న ఆరుగురిని స్థానిక పోలీసులు డ్రోన్‌ కెమెరా సహాయంతో అదుపులోకి తీసుకున్నారు. సీఐ కె.దుర్గాప్రసాదరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ముందస్తు సమాచారంతో సీఐ సూచనల మేరకు ఎస్‌ఐ వి.పాపారావు తన సిబ్బందితో కలిసి లేఅవుట్‌లో డ్రోన్‌ కెమోరా ఉపయోగించి గంజాయి సేవిస్తున్న వారిని గుర్తించారు. కాగితాల దేవీప్రసాదు, గుండు నవీన్‌, ఆకుల హేమంత్‌కుమార్‌, అడ్డగర్ల సతీష్‌, పోతిరెడ్డి సాయిప్రవీణ్‌, కోటిపల్లి సాయికుమార్‌ లను అదుపులోకి తీసుకున్నారు. తప్పించుకున్న మరో వ్యక్తి కొయ్య వాసు కోసం గాలిస్తున్నారు. పట్టుబడిన ఆరుగురిపై కేసు నమోదు చేశారు.

Updated Date - May 23 , 2026 | 11:59 PM