Another step మరో అడుగు
ABN , Publish Date - Oct 30 , 2026 | 12:16 AM
Another stepAnother step జిల్లాలో ఏర్పాటు చేయనున్న గ్రీన్‌ఫీల్డ్ స్టీల్‌ప్లాంట్‌కు మరో కీలక అడుగు పడింది. ప్రభుత్వం తాజాగా ప్రోత్సాహకాలు ప్రకటించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో వివిధ అంశాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సిలికాన్ క్రిస్టల్, వేఫర్ తయారీ సంస్థకు 91.10 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
మరో అడుగు
గ్రీన్‌ఫీల్డ్ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు
అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు
91.10 ఎకరాల కేటాయింపు
కేబినెట్‌లో తాజా నిర్ణయం
విజయనగరం, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో ఏర్పాటు చేయనున్న గ్రీన్‌ఫీల్డ్ స్టీల్‌ప్లాంట్‌కు మరో కీలక అడుగు పడింది. ప్రభుత్వం తాజాగా ప్రోత్సాహకాలు ప్రకటించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో వివిధ అంశాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సిలికాన్ క్రిస్టల్, వేఫర్ తయారీ సంస్థకు 91.10 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
గుర్ల మండలం కెల్లలో గ్రీన్‌ఫీల్డ్ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు కానున్న విషయం తెలిసిందే. దాదాపు రూ 8570.50 కోట్ల వ్యయంతో అక్కడ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు ప్రైవేటు సంస్థ మందుకు వచ్చింది. సూపర్ స్మెల్లర్స్ లిమిటెడ్ సంస్థ ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు 1100 ఎకరాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంతో ఉత్తర్వులు జారీ చేసింది. అభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి కల్పన లక్ష్యంగా విజయనగరం జిల్లాకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. స్టీల్‌ప్లాంట్‌లో ఏడాదికి రెండు మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి కానుంది. ప్లాంట్ రెండు దశల్లో నిర్మాణం కానుంది. ఈ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా 750 మందికి ఉపాధి లభిస్తుంది. దీనికి అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న సిలికాన్ క్రిస్టల్, వేఫర్ తయారీ కేంద్రానికి 91.10 ఎకరాలు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలపడం విశేషం.