Minister మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మరో వ్యక్తి అరెస్టు
ABN , Publish Date - Jul 10 , 2026 | 12:08 AM
Another Arrest Over Offensive Remarks Against Minister గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలతో అసభ్యకర పోస్టులు పెట్టిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
సాలూరు, జూలై9(ఆంధ్రజ్యోతి): గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలతో అసభ్యకర పోస్టులు పెట్టిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో బొబ్బిలి మండలం పోలవానివలసకు చెందిన వేణును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తాజాగా పాచిపెంట మండలం కొత్తవలస గ్రామానికి చెందిన సామిరెడ్డి భాస్కరరావును అరెస్టుచేసి కోర్టుకు తరలించినట్లు రూరల్ సీఐ రామకృష్ణ తెలిపారు. గురువారం సాలూరు రూరల్ సర్కిల్ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ ... సెల్ నెంబర్, మెయిల్ ఐడీ ఆధారంగా నిందితుడిని గుర్తించామన్నారు. ఎస్‌భాస్కరరావు07 పేరిట మంత్రిపై అసభ్యకర పోస్టులు పెట్టిన భాస్కరరావును అరెస్టు చేసి కోర్టుకు తరలించామన్నారు. నిందితుడు 2022-24లో విజయనగరం జిల్లా కొత్తవలసలో బీపీడీ పూర్తి చేశాడని, ప్రస్తుతం సీబీ సీడ్స్ కంపెనీలో పనిచేస్తున్నాడని వెల్లడించారు. ఈ కేసులో నిందితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తలిపారు.