Share News

ఇకపై ఏటా జాబ్‌ క్యాలెండర్‌

ABN , Publish Date - Sep 20 , 2026 | 12:24 AM

ఇకపై ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసి, ప్రభుత్వోద్యో గాలు భర్తీ చేస్తామని రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.

 ఇకపై ఏటా జాబ్‌ క్యాలెండర్‌
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేస్తున్న మంత్రి సంధ్యారాణి :

సాలూరు, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): ఇకపై ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసి, ప్రభుత్వోద్యో గాలు భర్తీ చేస్తామని రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. శనివారం సాలూరులోని ఓ డిగ్రీ కళాశాలలో యువత భవిషత్‌ భరోసా కార్యక్రమంలో మాట్లాడుతూ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను జగన్‌ మోసగిస్తే ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా జాబ్‌క్యాలెండర్‌ విడుదల చేసి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తూ యువతకు బంగారు పునాదులు వేస్తున్నామని తెలిపారు. విద్యార్థులు చదువులు పూర్తికాగానే యువత కు ఉద్యోగాలు లభించేలా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు రేయింబవళ్లు కృషి చేస్తున్నారన్నారు. కాగా సాలూరు టీడీపీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అనారోగ్యంతో వల్ల ఆసుపత్రిలో చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న లబ్ధిదారులకు రూ.4,50,508ల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను చెక్కులను సంధ్యారాణి పంపిణీ చేశారు.

Updated Date - Sep 20 , 2026 | 12:24 AM