Share News

Shambara Jatara శంబర జాతరకు చాటింపు

ABN , Publish Date - Jan 07 , 2026 | 11:40 PM

Announcement for the Shambara Jatara ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, భక్తుల కొంగుబంగారం శంబర పోలమాంబ మేనత్త పెదపోలమాంబ అనుపోత్సవం ముగిసింది. ఈ సందర్భంగా బుధ వారం సాయంత్రం గ్రామంలో చాటింపు వేశారు.

 Shambara Jatara  శంబర జాతరకు చాటింపు
శంబరలో చాటింపు వేస్తున్న దృశ్యం

మక్కువరూరల్‌, జనవరి7(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, భక్తుల కొంగుబంగారం శంబర పోలమాంబ మేనత్త పెదపోలమాంబ అనుపోత్సవం ముగిసింది. ఈ సందర్భంగా బుధ వారం సాయంత్రం గ్రామంలో చాటింపు వేశారు. ఆనవాయితీ ప్రకారం ఈ నెల 12న పోలమాంబను గ్రామంలోకి తెస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈనెల 26, 27, 28న జరగనున్న శంబర జాతరకు శ్రీకారం చుట్టినట్లయ్యింది. ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌ చినతిరుపతి, ఈవో బి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈకార్యక్రమం నిర్వహించారు.

విస్తృత ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్‌

పార్వతీపురం, జనవరి7(ఆంధ్రజ్యోతి): శంబర పోలమాంబ జాతరకు విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా అధికారులు, కమిటీ సభ్యులతో సమీక్షించారు. శాఖల వారీగా చేపట్టబోయే పనులపై చర్చించారు. ‘ జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా నుంచి లక్షలాదిగా మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలి. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతం చేయాలి. విద్యుత్‌ సరఫరా, తాగునీరు, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించాలి. పూర్తి స్థాయిలో బస్సులను ఏర్పాటు చేయాలి.’ అని కలెక్టర్‌ ఆదేశించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహించాలన్నారు.

Updated Date - Jan 07 , 2026 | 11:40 PM