Announcement for the Pydimamba Devara festivalపైడిమాంబ దేవర ఉత్సవానికి చాటింపు
ABN , Publish Date - Apr 21 , 2026 | 12:30 AM
Announcement for the Pydimamba Devara festival
పైడిమాంబ దేవర ఉత్సవానికి చాటింపు
విజయనగరం కల్చరల్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): పైడి మాంబ దేవర ఉత్సవానికి సంబంధించి చాటింపు ప్రక్రియ సోమవారం రాత్రి చదురుగుడి బాలాలయం వద్ద సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. దేవదాయశాఖ సహాయ కమిషనర్ కె.శిరీష ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన పూజారి బంటుపల్లి వెంకటరావు సమక్షంలో ఆలయ తలయారీ రామవరపు చినపైడిరాజు చాటింపు ప్రక్రియ చేపట్టారు. ఈ నెల 27న దేవర ఉత్సవం నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. అంతకుముందు పైడిమాంబకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవర ఉత్సవం రోజున వనంగుడి నుంచి అమ్మవారిని ఆలయ ప్రధాన పూజారి బంటుపల్లి వెంకటరావు ఇంటికి తరలించడమే కాకుండా అక్కడి నుంచి ఊరేగింపుగా చదురుగుడికి తీసుకువస్తారు. ఘాటాల ఊరేగింపు కూడా ఉంటుంది.
-------------------