Annadata Sukhibhava అన్నదాత సుఖీభవ నిధుల జమ
ABN , Publish Date - Mar 13 , 2026 | 11:44 PM
Annadata Sukhibhava Funds Credited జిల్లా రైతులకు ప్రభుత్వం ఉగాది కానుకగా ’అన్నదాత సుఖీభవ’ మూడో విడత నిధులను శుక్రవారం విడుదల చేసింది. కేంద్రం వాటా రూ.2 వేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందించే రూ.4వేలతో కలిపి ఒక్కో రైతుకు రూ.6వేల చొప్పున అందింది. ఈ మేరకు సుమారు 1.22 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 71 కోట్లు జమైంది.
పార్వతీపురం, మార్చి 13(ఆంధ్రజ్యోతి): జిల్లా రైతులకు ప్రభుత్వం ఉగాది కానుకగా ’అన్నదాత సుఖీభవ’ మూడో విడత నిధులను శుక్రవారం విడుదల చేసింది. కేంద్రం వాటా రూ.2 వేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందించే రూ.4వేలతో కలిపి ఒక్కో రైతుకు రూ.6వేల చొప్పున అందింది. ఈ మేరకు సుమారు 1.22 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 71 కోట్లు జమైంది. పాలకొండ నియోజకవర్గంలో 33,107 మంది రైతుల ఖాతాల్లో రూ. 19.24 కోట్లు, కురుపాంలో 39,084 మంది ఖాతాల్లో రూ. 22.71 కోట్లు, సాలూరు లో 24,262 మంది రైతుల ఖాతాల్లో రూ. 14.10 కోట్లు జమయ్యాయి. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో మూడు విడతల్లో కలిపి జిల్లా రైతులకు రూ. 210 కోట్లు నగదును అందజేసినట్లు అధికారులు తెలిపారు. కాగా కురుపాం, భామిని, బలిజిపేట మండలంలో వెంగాపురంలో రైతులకు ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి చెక్కులు అందించారు.