Share News

Thotapalli ‘తోటపల్లి’లో అన్నదానం నిలిపివేత

ABN , Publish Date - Jun 21 , 2026 | 12:19 AM

Annadanam Suspended at Thotapalli తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామస్వామి దేవస్థానాల పరిధిలో భక్తులకు ఉచిత అన్నసమారాధనను నిలుపుదల చేస్తున్నట్లు దేవస్థానం ఇన్‌చార్జి ఈవో వీవీ సూర్యనారాయణ తెలిపారు.

 Thotapalli ‘తోటపల్లి’లో అన్నదానం నిలిపివేత

గరుగుబిల్లి, జూన్‌20(ఆంధ్రజ్యోతి): తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామస్వామి దేవస్థానాల పరిధిలో భక్తులకు ఉచిత అన్నసమారాధనను నిలుపుదల చేస్తున్నట్లు దేవస్థానం ఇన్‌చార్జి ఈవో వీవీ సూర్యనారాయణ తెలిపారు. శనివారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు దాతల సహకారంతో అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించామన్నారు. అయితే దేవస్థానం పరిధిలో అన్నసమారాధన నిర్వహణకు దేవదాయశాఖ ఉన్నతాధికారులు, ఆహార శాఖ నుంచి అనుమతులు రాలేదని వెల్లడించారు. ఈ నేపథ్యంలో దేవస్థానంతో పాటు ప్రైవేట్‌ వ్యక్తుల సహకారంతో సంబంధిత కార్యక్రమం నిర్వహించడానికి అవకాశం లేదన్నారు. ఈ విషయాన్ని గమనించి.. భక్తులు, సందర్శకులు సహకరించాలని కోరారు.

Updated Date - Jun 21 , 2026 | 12:19 AM