Share News

‘Anna’ Data is happy. ‘అన్న’దాతా సుఖీభవ

ABN , Publish Date - Apr 21 , 2026 | 12:28 AM

‘Anna’ Data is happy. న్నదాతా సుఖీభవ.. చంద్రన్నకు జై అంటూ అన్నా క్యాంటీన్లలో పేదలు సోమవారం ఆనందంగా భోజనం చేశారు. సాధారణ రోజుల్లో కన్నా ఎక్కువ మంది హాజరయ్యారు.

‘Anna’ Data is happy. ‘అన్న’దాతా సుఖీభవ
పేదలకు అల్పాహారం వడ్డిస్తున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

‘అన్న’దాతా సుఖీభవ

అన్నా క్యాంటీన్లలో సందడే సందడి

సీఎం చంద్రబాబు పుట్టినరోజు పురస్కరించుకుని ఉచితంగా బోభనం

వందలాదిగా తరలివచ్చిన ప్రజలు

విజయనగరం, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): అన్నదాతా సుఖీభవ.. చంద్రన్నకు జై అంటూ అన్నా క్యాంటీన్లలో పేదలు సోమవారం ఆనందంగా భోజనం చేశారు. సాధారణ రోజుల్లో కన్నా ఎక్కువ మంది హాజరయ్యారు. జిల్లాలోని అన్ని క్యాంటీన్లలోనూ ఇదే కళ కనిపించింది. వ్యవసాయ కూలీలు, రైతులు, నిరుద్యోగ యువత, విద్యార్థులు ఎంతో మంది సోమవారం అన్న క్యాంటీన్లలో భోజనం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పుట్టిన రోజును పురస్కరించుకుని అన్ని అన్నా క్యాంటీన్లలో సోమవారం అల్పాహారం, భోజనం ఉచితంగా అందించడమే కాకుండా మిగతా రోజుల కంటే ఎక్కువ మందికి వడ్డించారు. ఇందుకయ్యే ఖర్చును చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి ముందే చెల్లించారు. ప్రచార సాధనాలు, సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకుని ఎక్కువ మంది అన్న క్యాంటీన్లకు తరలివచ్చారు. జిల్లాలోని 9 క్యాంటీన్లలో ప్రతి రోజూ 6,150 మంది భోజనాలు చేస్తుండగా సోమవారం 7,780 మంది భోజనం చేశారు. అదనంగా 1,730 మంది హాజరయ్యారు. చీపురుపల్లిలో అన్నాక్యాంటీన్‌ను సోమవారమే ప్రారంభించారు. తొలిరోజు 450 మంది వచ్చారు.

ప్రతిరోజు సోమవారం పెరిగిన వారు

విజయనగరం

ఆర్టీసీ కాంప్లెక్స్‌ క్యాంటీన్‌ 1,500 1,700 200

ప్రకాశం పార్కు 1,200 1,380 180

ఘోషాసుపత్రి 1,400 1,550 150

గజపతినగరం 900 1,200 300

నెల్లిమర్ల 500 980 480

చీపురుపల్లి ---- 450 ----

కొత్తవలస 350 620 270

బొబ్బిలి 300 650 150

రాజాం 215 415 200

========== ===========

చంద్రబాబుకు ప్రజా దీవెనలు

మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

గజపతినగరం/బొండపల్లి, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలూ కృషిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజాదీవెనలు కలకాలం ఉంటాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం చంద్రబాబు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని స్థానిక అన్నా క్యాంటీన్‌లో ఉదయం పేదలకు అల్పాహారం వడ్డించారు. ఈసందర్భంగా మాట్లాడుతు చంద్రబాబు నాయకత్వం యువతకు ఆదర్శమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం తపించే వ్యక్తి దొరకడం రాష్ట్ర ప్రజల అదృష్టంగా భావిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రానికి మరింత మంచి చేయడానికి ఆయనకు శక్తి, ఆరోగ్యం కలగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి, ఏఎంసీ చైర్మన్‌ పీవీవీ గోపాలరాజు తదితరులు పాల్గొన్నారు.

- చంద్రబాబునాయుడు పుట్టిన రోజు పురస్కరించుకొని సోమవారం బొండపల్లి మండలం నెలివాడ గ్రామం వద్దనున్న ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో టీడీపీ శ్రేణులు కేక్‌ కట్‌ చేసి వేడుకలు జరుపుకున్నారు. కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ కూడా పాల్గొన్నారు. యువకులు 316 మంది పాల్గొని రక్తదానం చేశారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మక్కువ శ్రీధర్‌, ఏఎంసీ చైర్మన్‌ పీవీవీ గోపాలరాజు కూడా రక్తదానం చేశారు.

Updated Date - Apr 21 , 2026 | 12:28 AM