Share News

నిరుపేదల కోసమే అన్న క్యాంటీన్‌లు’

ABN , Publish Date - Apr 25 , 2026 | 12:14 AM

నిరుపేదలకు పట్టెడన్నం పెట్టాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్‌లను ఏర్పాటు చేస్తోం దని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అన్నారు.

నిరుపేదల కోసమే అన్న క్యాంటీన్‌లు’
అన్న క్యాంటీన్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే జయకృష్ణ, కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

‘సీతంపేట రూరల్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి) నిరుపేదలకు పట్టెడన్నం పెట్టాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్‌లను ఏర్పాటు చేస్తోం దని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అన్నారు. శుక్రవారం సీతంపేటలో నూతనంగా నిర్మించిన అన్న క్యాంటీన్‌ను కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం అన్న కాంటీన్‌లో భోజనం వడ్డించారు. ఈ సంద ర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్‌లు ఏర్పాటు చేస్తున్నా మన్నారు. గిరిజనులకు తాగునీరు, మెరుగైన వైద్యం, రహదారలు వంటి సౌకర్యాలు కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఇదిలా ఉండగా, సమావేశంలో పాలకొండ టీడీపీ ఇన్‌చార్జి పడాల భూదేవి మాట్లాడేందుకు సిద్ధం కావడంతో కొందరు టీడీపీ కార్యకర్తలు ఆమె ప్రసం గాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దాంతో ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ కల్పించుకుని అందరం మనమేనని, వివాదాలు వద్దని సర్దిచెప్పారు. దాంతో భూదేవి కాసేపు మాట్లాడి అక్కడి నుంచి వెనుదిరిగారు. అనంతరం టీడీపీ నాయకుల మద్య చిన్నపాటి తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. కార్యక్రమంలో సీతంపేట ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్‌ జగన్నాథ్‌, డీడీ ఎం.అన్నాదొర, తహసీల్దార్‌ శ్రీకన్య, డిప్యూటీ ఈవో పి.నారాయడు, ఏఎంసీ చైర్మన్‌ సంధ్యారాణి, నాయకులు కర్నేన అప్పలనాయుడు, ఉదయ్‌ భాస్కర్‌, గంటా సంతోష్‌, వెన్నపు శ్రీనివాసరావు, జానీ, ప్రభు కుమార్‌, రంగ పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ త్వరగా కోలుకోవాలని కోరుతూ సీతంపేటలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే జయకృష్ణ పూజలు నిర్వహించారు.

Updated Date - Apr 25 , 2026 | 12:14 AM