రేపే Andhra Jyoti and ABN Mutyala muggula competation tomorrow ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ముత్యాల ముగ్గుల పోటీలు
ABN , Publish Date - Jan 01 , 2026 | 11:39 PM
Andhra Jyoti and ABN Mutyala muggula competation tomorrow
రేపే ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ముత్యాల ముగ్గుల పోటీలు
ఆనందగజపతి ఆడిటోరియం ఆవరణలో చురుగ్గా ఏర్పాట్లు
విజయనగరం, జనవరి1 (ఆంధ్రజ్యోతి):
ముగ్గుల పోటీలకు ఇంకా ఒక రోజే గడువుంది. ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ నిర్వహిస్తున్న సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు... పవర్డ్ బై: సన్‌ఫీస్ట్ మ్యాజిక్ మామ్స్ బిస్కెట్, టేస్ట్ పార్టనర్ స్వస్తిక్ మసాలా, ప్రేయర్ పార్టనర్ పరిమళ్ మందిర్ భారత్‌వాసి అగరబత్తీ.. ఆధ్వర్యంలో హాజరయ్యే మహిళల కోసం చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. శనివారం జరిగే పోటీల్లో మహిళలు ఎవరైనా ఉచితంగా పాల్గొనవచ్చు. నిబంధనల ప్రకారం చుక్కలు ముగ్గులు మాత్రమే వేయాలి. ఒక ముగ్గు ఒకరు మాత్రమే వేయాలి. అవసరమైన రంగులు పోటీ చేసేవారే తీసుకురావాలి. ఈ పోటీలకు ప్రధాన స్పాన్సర్‌గా సంతూర్ సోప్స్ వ్యవహరిస్తోంది. కో-స్పాన్సర్‌గా సన్‌ఫీస్ట్- మామ్స్ మ్యాజిక్, స్వస్తిక్, భారత్‌వాసి ఆగర్‌బత్తి వ్యవహరిస్తున్నాయి. లోకల్ స్పాన్సర్‌గా విజయనగరం సుఖీభవ హాస్పిటల్ సహాయ సహకారాలు అందిస్తోంది.
విజయనగరంలోని అయోధ్యమైదానం రోడ్డులో ఉన్న ఆనందగజపతి ఆడిటోరియం ఆవరణలో పోటీలు జరుగుతాయి. పాల్గొనే వారు శనివారం ఉదయం 9గంటలకు చేరుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ముగ్గు పూర్తి చేయడానికి రెండుగంటల పాటు సమయం ఉంటుంది. అనంతరం ముగ్గురు న్యాయనిర్ణేతలు ముగ్గులను పరిశీలించి మార్కులు వేస్తారు. ఎక్కువ మార్కులు సాధించిన మహిళను ప్రథమ విజేతగా ఎంపిక చేస్తారు. ప్రథమ బహుమతి కింద రూ.6000 కాగా ద్వితీయ బహుమతి రూ.4000, తృతీయ బహుమతి రూ.3000 చొప్పున అందజేస్తారు. పోటీలో పాల్గొనే ప్రతి ఒక్కరికీ పార్టీసిపేషన్ బహుమతి ఉంటుంది. న్యాయనిర్ణేతలుగా రవ్వా మంజు, ఎ.దేవి, కృష్ణవేణి వ్యవహరించనున్నారు. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఎస్పీ ఏఆర్ దామోదర్, ఆర్‌డీవో దాట్ల కీర్తి, నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ కిల్లాన అప్పలరాజు, ప్రముఖ స్ర్తీల వైద్య నిపుణురాలు డాక్టరు జి.సన్యాసమ్మ, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సతీమణి కొండపల్లి లక్ష్మీ సింధూ తదితరులు హాజరుకానున్నారు.
ముత్యాలముగ్గుల పోటీలకు మహిళల నుంచి అనుహ్య స్పందన లభిస్తోంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు తరలివచ్చేందుకు ‘ఆంధ్రజ్యోతి’ని సంప్రదిస్తున్నారు. జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి పొందిన వారు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. అక్కడకు వెళ్లేందుకు విజేతతో పాటు మరొకరికి ప్రయాణ, వసతి ఖర్చులు ఆంధ్రజ్యోతి- ఏబీన్ భరిస్తుంది.
===============
పోటీలు జరిగే చోటు: ఆనందగజపతి ఆడిటోరియం ఆవరణం
తేదీ: జనవరి 3, శనివారం.
వ్యవధి: రెండు గంటలు
నిబంధనలు: చుక్కల ముగ్గులు వేయాలి. రంగులను పోటీదారులే తీసుకురావాలి.
బహుమతులు: ప్రథమ రూ.6000, ద్వితీయ రూ.4000, తృతీయ రూ.3000 అందజేస్తారు.
===========