సైబర్ నేరాలపై ఉక్కుపాదం
ABN , Publish Date - Jun 14 , 2026 | 11:57 PM
జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాల రవా ణా, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపనున్నట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలి పారు.
ఎస్పీ ఏఆర్ దామోదర్
మెరకముడిదాం, జూన్ 14(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాల రవా ణా, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపనున్నట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలి పారు. ఆదివారం బుదరాయ వలస పోలీసు స్టేషన్‌ను పరిశీ లించారు. అనంతరం సిబ్బంది తో సమావేశమై పలు సూ చనలుచేశారు. పోలీసు స్టేషన్ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఆయనతోపాట డీఎస్పీ ఎస్. రాఘవులు, సీఐ జి.శంకరరావు, ఎస్‌ఐ జె.లోకేష్‌కుమార్, పోలీసు సిబ్బంది ఉన్నారు.
పోలీసులు ప్రజలకు చేరువగా ఉండాలి
వంగర, జూన్ 14(ఆంధ్రజ్యోతి): పోలీసులు ప్రజలకు చేరువగా ఉండి సేవలం దించాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ సిబ్బందికి సూచించారు. ఆదివారం వంగర పోలీసు స్టేషన్‌ను తనిఖీచేశారు. తొలుత రికార్డులు, స్టేషన్ పరిసరాలు పరిశీలిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వంగర మీదుగా ఒడిశా నుంచి రావడానికి సులువైన మార్గం కావడంతో గంజాయి తరలింపునకు అక్రమార్కులు సిద్ధపడిన వేళ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి వారికి కట్టడి చేయాలన్నారు. ఆయన వెంట చీపురుపల్లి డీఎప్పీ రాఘవులు, సీఐ ఉపేంద్ర, ఎస్‌ఐ షేక్ శంకర్ ఉన్నారు.
లక్ష్యంతో ముందుకుసాగాలి
రాజాం రూరల్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): యువత లక్ష్యంతో ముందుకు సాగాలని ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ పిలుపునిచ్చారు. రాజాంలో జీఎంఆర్ డీమ్డ్ టు బి యూనివర్శిటీలో జరుగుతున్న ఎన్‌సీపీ వార్షిక శిక్షణ కార్యక్రమంలో ఎస్పీ మా ట్లాడారు. కార్యక్రమంలో చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు, ఎన్‌సీసీ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ శశాంక్ కుశ్వర్, ఏఓ లెఫ్టినెంట్ కల్నల్ ప్రదీప్ మీనన్, రాజాం టౌన్, రూరల్ సీఐలు అశోక్‌కుమార్, ఉపేంద్ర పాల్గొన్నారు.