Share News

ఆటో, రెండు ద్విచక్ర వాహనాలు ఢీ

ABN , Publish Date - Nov 16 , 2026 | 12:27 AM

మండలంలోని అక్కివరం జంక్షన్‌ సమీప సర్వీస్‌ రోడ్డులో ఆదివారం రెండు ద్విచక్రవాహనాలు, ఆటో ఢీకొన్న ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి.

 ఆటో, రెండు ద్విచక్ర వాహనాలు ఢీ

  • నలుగురికి గాయాలు

భోగాపురం, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): మండలంలోని అక్కివరం జంక్షన్‌ సమీప సర్వీస్‌ రోడ్డులో ఆదివారం రెండు ద్విచక్రవాహనాలు, ఆటో ఢీకొన్న ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. భోగాపురం మండలం రామచంద్రపే టకు చెందిన గాబు మనోహర్‌రెడ్డి సవరవల్లి వైపు నుంచి భోగాపురం వైపు ద్విచ క్రవాహనంపై వస్తున్నారు. అలాగే నాతవలసకు చెందిన పైల రమణ ఆటోపై భోగాపురం వైపు నుంచి సవరవల్లి వైపు వెళ్తున్నారు. అలాగే అదే రహదారిలో జమ్మయ్యపేటకు చెందిన కొరాడ రాంబాబు, పూజిత ద్విచక్రవాహనంపై భోగా పురం వైపు నుంచి సవరవల్లి వైపు వెళ్తున్నారు. అక్కివరం జంక్షన్‌ సమీపానికి వచ్చేసరికి సవరవల్లి వైపు నుంచి వస్తున్న ద్విచక్ర వాహనం భోగాపురం వైపు నుంచి వెళ్తున్న ఆటోని, ద్విచక్ర వాహనాన్ని ఢీకుంది. దీంతో నలుగురికి గాయా లయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకు ని.. వివరాలు నమోదు చేసుకున్నారు. దీనిపై పోలీసుస్టేషన్‌లో ఇంకా ఎటువంటి కేసు నమోదు కాలేదు.

Updated Date - Nov 16 , 2026 | 12:28 AM