Healthcare Services అమ్మా .. వైద్యసేవలు ఎలా అందుతున్నాయ్?
ABN , Publish Date - Jun 05 , 2026 | 11:47 PM
"Amma, How Are the Healthcare Services Being Provided?" అమ్మా .. వైద్యసేలు ఎలా అందుతున్నాయ్..! ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉంటున్నారా? మందులు ఉచితంగా ఇస్తున్నారా.. లేదా?’ అని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి రోగులను అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం కురుపాం సీహెచ్‌సీని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రోగుల వద్దకు నేరుగా వెళ్లి మాట్లాడారు.
కురుపాం సీహెచ్‌సీ పరిశీలన
కురుపాం, జూన్ 5(ఆంధ్రజ్యోతి): ‘ అమ్మా .. వైద్యసేలు ఎలా అందుతున్నాయ్..! ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉంటున్నారా? మందులు ఉచితంగా ఇస్తున్నారా.. లేదా?’ అని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి రోగులను అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం కురుపాం సీహెచ్‌సీని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రోగుల వద్దకు నేరుగా వెళ్లి మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అందుతున్న సేవలపై ఆరా తీశారు. రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న ఆసుపత్రి అదనపు భవనాన్ని పరిశీలించారు. ఈ నెల 15లోగా పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో వివిధ విభాగాలు, రికార్డులు, మందుల నిల్వలను పరిశీలించారు. ఆ తర్వాత ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో పవార్ స్వప్పిల్ జగన్నాథ్, డీసీహెచ్‌ఎస్ నాగభూషణరావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ సందీప్ , వైద్యులు పాల్గొన్నారు.
రేపటి నుంచి యోగా దినోత్సవం
పార్వతీపురం, జూన్ 5(ఆంధ్రజ్యోతి): జిల్లాలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈనెల 7 నుంచి 21 వరకు నిర్వహించనున్నట్టు కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. యోగాంధ్ర కార్యక్ర మంలో భాగంగా పర్యాటక ప్రాంతాలు, చారిత్రక ప్రదేశాల్లో ప్రత్యేక ప్రదర్శనలు, శిక్షణ కార్యక్ర మాలు, పోటీలు నిర్వహించనున్నామన్నారు. ఇందుకోసం మూడు స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో 500 మంది చొప్పున పాల్గొనేలా ప్రత్యేక యోగా ప్రదర్శనల షెడ్యూల్‌ను ఖరారు చేశామన్నారు. 11న తోటపల్లి వేంకటేశస్వారస్వామి ఆల యంలో, 15న సీతంపేట ఎన్టీఆర్ అడ్వంచర్‌పార్క్, జూన్ 20న పాలకొండ, పార్వతీపురం, సాలూరులో యోగా కార్యక్రమాలు ఉంటాయన్నారు. 21న జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ప్రధాన వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. యోగా పోటీల్లో 10 నుంచి 35 ఏళ్లు పైబడిన వారు పాల్గొనొచ్చన్నారు.