Festive Cheer.. సందడిగా..
ABN , Publish Date - Aug 12 , 2026 | 12:21 AM
Amid Festive Cheer.. సాలూరు పట్టణంలో మంగళవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు సందడిగా సాగాయి. గిరిజనుల కోలాటం ప్రదర్శన, థింసా నృత్యాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నివాసం నుంచి పట్టణంలో మామిడిపల్లి జంక్షన్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వరకు వేలాది మంది ఆదివాసీలు ర్యాలీ నిర్వహించారు.
ఆకట్టుకున్న థింసా నృత్యం, కోలాటం ప్రదర్శన
ఆదివాసీల ర్యాలీలో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి
సాలూరు, ఆగస్టు11(ఆంధ్రజ్యోతి): సాలూరు పట్టణంలో మంగళవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు సందడిగా సాగాయి. గిరిజనుల కోలాటం ప్రదర్శన, థింసా నృత్యాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నివాసం నుంచి పట్టణంలో మామిడిపల్లి జంక్షన్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వరకు వేలాది మంది ఆదివాసీలు ర్యాలీ నిర్వహించారు. డప్ప వాయిద్యాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహం, అల్లూరి సీతారామరాజు ఫ్లెక్సీకి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం అక్కడ నుంచి వారంతా మళ్లీ మంత్రి ఇంటికి చేరుకున్నారు. మందుగా మాజీ జడ్పీటీసీ మంచాల పారమ్మ ఆదివాసీ సంప్రదాయాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి సంధ్యారాణి మాట్లా డుతూ.. గతంలో ఎన్నడూలేని విధంగా నాలుగురోజుల పాటు జిల్లాలో ఆదివాసీ దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ‘ఆదివాసీ దినోత్సవం అనేది.. ఒక వేడుక కాదు. గిరిజ నుల ఆత్మ గౌరవానికి ప్రతీక, చరిత్రకు గౌరవం, హక్కులకు గుర్తింపు, భవిష్యత్తుకు భరోసా.’ అని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనలో గిరిజనులకు మేలు జరుగుతోం దన్నారు. గిరిజన సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేస్తున్నారని వెల్లడించారు.ప్రతీ గిరిజన కుటుంబం ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం కావాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. డీఎస్సీ ఉద్యోగాల్లో దాదాపు 2వేల ఉద్యోగాలు గిరిజనులకు వచ్చాయన్నారు. అయితే దీనిపై వైసీపీ నిరసనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సూర్యఘర్ పేరుతో ఉచిత విద్యుత్ అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, ఆదివాసీ సంఘం నాయకుల పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.