‘అమెరికా వైఖరి గర్హనీయం’
ABN , Publish Date - Mar 05 , 2026 | 12:04 AM
ప్రపంచంపై పెత్తనం కోసం యుద్ధ కాంక్షతో రగిలిపోతున్న అమెరికా వైఖరి గర్హనీయమని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ అన్నారు.
బొబ్బిలి, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): ప్రపంచంపై పెత్తనం కోసం యుద్ధ కాంక్షతో రగిలిపోతున్న అమెరికా వైఖరి గర్హనీయమని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ అన్నారు. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా బుధవారం స్ధానిక గంటి ప్రసాదం స్మారక భవనం నుంచి గొల్లవీధి జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ అమెరికా తీరును తీవ్రస్థాయిలో ఎండగట్టారు. ప్రపంచ అశాంతికి కారణమవుతున్న అమెరికా దుర్నీతి విధానాలను అందరూ ప్రతిఘటించాలన్నారు. వేలు, లక్షల సంఖ్యలో సామాన్య ప్రజానీకం ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోతున్నారని సర్వం కోల్పోయి నానా అవస్ధలు పడుతున్నారన్నారు. ఈనేపథ్యంలో అమెరికా తక్షణమే యుద్ధం ఆపాలన్నారు. భారత్‌పై ఆంక్షలతో అమెరికా ఆర్థిక నష్టాన్ని కలిగిస్తున్నా మోడీ స్పందించకపోవడం అన్యాయమన్నారు. యుద్ధ విరమణ కోసం ఒత్తిడి చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు శంకరరావు, లక్ష్మి, సురేష్, జగన్మోహన్ పాల్గొన్నారు.