Share News

ఏఎంసీ అభివృద్ధే ధ్యేయంగా పని చేయాలి:ఎమ్మెల్యే

ABN , Publish Date - Mar 14 , 2026 | 12:51 AM

ఎచ్చెర్ల ఏఎంసీ అభివృద్ధే ద్యేయంగా పాలక వరం్గ పని చేయాలని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు.

 ఏఎంసీ అభివృద్ధే ధ్యేయంగా పని చేయాలి:ఎమ్మెల్యే

లావేరు, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): ఎచ్చెర్ల ఏఎంసీ అభివృద్ధే ద్యేయంగా పాలక వరం్గ పని చేయాలని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. శుక్రవారం ఎచ్చెర్ల ఏఎంసీ కార్యాలయం వద్ద నూతన పాలక వర్గం మొదటి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లావేరు మండలం వెంకటాపురం జంక్షన్‌, రణస్థలం మండలం నెలివాడ జంక్షన్‌లో కొత్తగా చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసి ఆదాయం పెంపొందించుకోవాలన్నారు. తద్వారా ఏఎంసీకి అవసరమైన కొంత మంది సిబ్బందిని నియమించుకునే అవకాశం కలుగుతుందన్నారు. చెక్‌పోస్టులలో వసూలు చేసిన నగదుకు తప్పనిసరిగా రశీదు ఉండేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా ఏఎంసీ రికార్డులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌ను పాలక వర్గ సభ్యులు సత్కరించారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్‌ నిడిగంట్ల పద్మావతి, వైస్‌ చైర్మన్‌ బూరాడ వెంకటరమణ, మండల టీడీపీ అద్యక్షులు ముప్పిడి సురేష్‌, మాజీ ఏఎంసీ చైర్మన్‌ తోటయ్యదొర, కూటమి నాయకులు లంక శ్యామలరావు, పిన్నింటి మధుబాబు, కుమరాపు రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

భూ సర్వే పక్కాగా ఉండాలి

రణస్థలం, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): భూముల రీసర్వే పక్కాగా ఉండాలని, గత ప్రభుత్వం చేపట్టిన భూ సర్వేలో దొర్లిన తప్పులను సరిచేయాలని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం రణస్థలం తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెవెన్యూ సిబ్బందితో మాట్లాడారు. భూ సర్వే ఎలా జరుగుతుందోనని ఆరా తీశారు. ఇటీవల చేపట్టిన భూ సర్వే వివరాలు తహసీల్దార్‌ సనపల కిరణ్‌కుమార్‌ ఆయనకు వివరించారు. భూ సర్వేలో తప్పులు దొర్లితే ఉపేకించేది లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

Updated Date - Mar 14 , 2026 | 12:51 AM