ప్రజాస్వామ్య విశిష్టతను చాటిన అంబేడ్కర్
ABN , Publish Date - Mar 04 , 2026 | 12:12 AM
ప్రపంచ దేశాలకు ప్రజాస్వామ్య విలువలను , విశిష్టతను తెలియజేసిన మేధావి బీఅర్ అంబేడ్కర్ అని మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు అన్నారు.
విజయనగరం దాసన్నపేట, మార్చి 3 (ఆంఽధ్రజ్యోతి): ప్రపంచ దేశాలకు ప్రజాస్వామ్య విలువలను , విశిష్టతను తెలియజేసిన మేధావి బీఅర్ అంబేడ్కర్ అని మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు అన్నారు. మంగళవారం జొన్నవలస గ్రామంలో జిల్లా దళిత సమ్మేళన సదస్సుకి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ పిల్లలను చదివించి ఉన్నత విలువలతో పెంచాలని సూచించారు. అంబేడ్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాలమహానాడు ప్రతినిధులు లోగిశ రామకృష్ణ, సంతోషి, పైడిరాజు, మరువాడ ఈశ్వరరావు, రాజు, నారాయణరావు, బంగార్రాజు పాల్గొన్నారు.