Share News

అమర్‌నాథ్‌ ను సాగనంపాలి

ABN , Publish Date - Jun 18 , 2026 | 12:20 AM

మాజీ మంత్రి వైసీపీ నాయకుడు గుడి వాడ అమర్‌నాథ్‌ ను విశాఖ నుంచి సాగనంపాలని ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పిలుపునిచ్చారు.

 అమర్‌నాథ్‌ ను సాగనంపాలి
అమర్‌నాథ్‌ చిత్రపటానికి కోడిగుడ్లతో సత్కరిస్తున్న ఎమ్మెల్యే లలితకుమారి

  • ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి

లక్కవరపుకోట, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైసీపీ నాయకుడు గుడి వాడ అమర్‌నాథ్‌ ను విశాఖ నుంచి సాగనంపాలని ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పిలుపునిచ్చారు. బుధవారం లక్కవరపుకోటలో టీడీపీ నాయకులు, మహిళలతో కలిసి హోంమంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా అమర్‌నాథ్‌ చిత్రపటానికి కోడిగుడ్లతో సత్కరించారు. అనంతరం కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన , అభివృద్ధి సంక్షేమంపై పార్టీ నేతలు, అధికారులతో సమీక్షించారు. కార్య క్రమంలో పార్టీ నేతలు కరెడ్ల ఈశ్వరరావు, రమణమూర్తి, జీఎస్‌.నాయుడు, రెడ్డి వెం కన్న, చంద్రశేఖర్‌, చిన్నబ్బినాయుడు, భూపాల్‌నాయుడు, ఈశ్వరరావు పాల్గొన్నారు.

విజయనగరం రూరల్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్‌ హోంమంత్రి అనితను ఉద్ధేశించి చేసిన వ్యాఖ్యలు మహిళలను కించపరిచే విధంగా ఉండడంతో తక్షణమే ఆయనపై చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సువ్వాడ వనజాక్షి కోరారు. ఈ మేరకు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైర్‌క్టర్‌కు విజయనగరంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో తెలుగుమహిళా నాయకులు చిల్లా పద్మ, కింతాడ కళావతి, బొంతు ఉమా పాల్గొన్నారు.

జామి, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి కొడిగుడ్డు అమర్‌నాథ్‌ మీ ఇంట్లో ఉన్న తల్లి, చెల్లిని, మహిళలను నిత్యం ఇలాగే మాట్లాడుతున్నారా అని వెలమ కార్పొ రేషన్‌ డైరక్టర్‌ మాకిరెడ్డి శ్రీలక్ష్మి ప్రశ్నించారు. జామిలో ఆమె విలేకరులతో మాట్లాడు తూ హోంమంత్రి అవినీతిపై చేసిన వ్యాఖ్యలకు క్షమపణ చెప్పాలని డిమాండ్‌చేశారు.

Updated Date - Jun 18 , 2026 | 12:20 AM