Share News

అమరావతికి చట్టబద్ధతపై హర్షం

ABN , Publish Date - Apr 05 , 2026 | 12:10 AM

అమరావతి రాజధానికి చట ్టబద్ధతపై ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి హర్షం వ్యక్తం చేశారు.

అమరావతికి చట్టబద్ధతపై హర్షం
కొవ్వొత్తులు వెలిగించిన ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి

గుమ్మలక్ష్మీపురం, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధానికి చట ్టబద్ధతపై ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి హర్షం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక క్యాంప్‌ కార్యాలయంలో ఆమె నాయకులతో కలిసి కొవ్వొత్తులు వెలిగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమరావతికి పట్టిన గ్రహణం వీడి నట్టయిందన్నారు. ప్రజా రాజధానికి న్యాయం జరిగిందన్నారు. పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందినందుకు సహకరించిన అన్ని రాజకీయ పార్టీలకు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమం త్రి నారా చం ద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతితో పాటు రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

Updated Date - Apr 05 , 2026 | 12:11 AM