Share News

Always encouragement for those who work hard. కష్టపడేవారికి ఎప్పుడూ ప్రోత్సాహం

ABN , Publish Date - Aug 23 , 2026 | 12:14 AM

Always encouragement for those who work hard. కష్టపడి పనిచేసేవారిని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తానని, అటువంటి వారికి ఇటు పార్టీలోనూ విలువ ఉంటుందని సీఎం నారా చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం సాయంత్రం లక్కవరపుకోట మండల కేంద్రంలో వున్న తెలుగు దేశం పార్టీ సీనియర్‌ నాయకుడు కోళ్ల బాలాజీ అప్పల రామప్రసాద్‌, శృంగవరపుకోట శాసన సభ్యురాలు కోళ్ల లలితకుమారి నివాసంలో ఈ నెల 27న వివాహం కానున్న వీరి కుమార్తె అస్మిత నాయుడు, చప్ప ఎర్ని పవన్‌ మౌళిలకు ఆశీర్వాదం అందించారు.

Always encouragement for those who work hard. కష్టపడేవారికి ఎప్పుడూ ప్రోత్సాహం
కాబోయే వధువరులకు పూలబొకే అందిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు

కష్టపడేవారికి ఎప్పుడూ ప్రోత్సాహం

నిజాయితీగా రాజకీయం చేసిన మాజీ మంత్రి కోళ్ల అప్పలనాయుడు

కుటుంబ సభ్యులు ఎవరెక్కడున్నారో ఆరా తీసిన సీఎం చంద్రబాబు నాయుడు

కాబోయే దంపతులు అస్మితనాయుడు, ఎర్ని పవన్‌మౌళికి ఆశీర్వాదం

శృంగవరపుకోట (లక్కవరపుకోట), ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): కష్టపడి పనిచేసేవారిని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తానని, అటువంటి వారికి ఇటు పార్టీలోనూ విలువ ఉంటుందని సీఎం నారా చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం సాయంత్రం లక్కవరపుకోట మండల కేంద్రంలో వున్న తెలుగు దేశం పార్టీ సీనియర్‌ నాయకుడు కోళ్ల బాలాజీ అప్పల రామప్రసాద్‌, శృంగవరపుకోట శాసన సభ్యురాలు కోళ్ల లలితకుమారి నివాసంలో ఈ నెల 27న వివాహం కానున్న వీరి కుమార్తె అస్మిత నాయుడు, చప్ప ఎర్ని పవన్‌ మౌళిలకు ఆశీర్వాదం అందించారు. అక్షింతలు వేసి దీవించారు. బోకే అందించి అభినందనలు తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులు ఎవరెక్కడ వున్నారని చంద్రబాబు ఆరా తీశారు. విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల పరిధిలో వున్నట్లు వారు చెప్పారు. కుటుంబ సభ్యులందరూ ఒక్కోక్కరుగా పరిచయం చేసుకున్నారు. వారందరిని సీఎం అప్యాయంగా పలకరించారు. మాజీ మంత్రి కోళ్ల అప్పలనాయుడు నీజాయితీగా రాజకీయం చేసారని గుర్తుచేశారు. ఎమ్మెల్యే లలిత కుమారి మాట్లాడుతూ అప్పుడు టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు, ఇప్పుడు చంద్రబాబు తమ కుటుంబానికి అండగా వుండి నడిపిస్తున్నారని అన్నారు. తమ కుటుంబం దీన్ని అదృష్టంగా భావిస్తోందని కృతజ్ఞతలు తెలిపారు. గత సార్వత్రిక ఎన్నికల్లో తనపై నమ్మకం వుంచి శాసన సభ టిక్కెట్‌ ఇవ్వడంతో పాటు గెలిపించేందుకు నియోజకవర్గానికి వచ్చారని, యవనేత.. మంత్రి నారా లోకేశ్‌ కూడా ప్రచారానికి వచ్చారని గుర్తుచేశారు. ఎమ్మెల్యే మరిది దివంగత కోళ్ల మోహన్‌ కుమార్తె కుందన వైకల్యం గురించి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన వైద్యానికి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. సాయంత్రం 5.20 గంటలకు వచ్చిన సీఎం 5.30 గంటల వరకు ఈ కుటుంబంతో ముచ్చటించారు. పది నిమిషాల పాటు గడపడంతో ఎమ్మెల్యే లలిత కుమారి కుటుంబం ఉబ్బితబ్బిబ్బయ్యింది.

సీఎం చంద్రబాబు పర్యటన ఇలా..

- అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం ఏ.కోడూరు నుంచి సీఎం చంద్రబాబు నాయుడు లక్కవరపుకోట మండల రంగారాయపురం గ్రామ పరిధిలోని విశాఖ-అరకు రోడ్డుకు ఆనుకుని వున్న బహిరంగ ప్రదేశంలో సాయంత్రం 5.03 గంటలకు హెలిపాడ్‌లో దిగారు.

- ఐదు మండలాల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్‌ ఇన్‌చార్జిలతో కరచాలనం చేశారు. లక్కవరపుకోట మండల పార్టీ అధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ కరెండ్ల ఈశ్వరరావుతో ప్రత్యేకంగా మాట్లాడారు.

- సీఎం చంద్రబాబు నాయుడును చూసేందుకు వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలను హెలిపాడ్‌ వద్దకు అనుమతించకపోవడంతో దూరం నుంచి చూసేందుకు ప్రయత్నించారు. వారందరికీ సీఎం అభివాదం చేశారు.

- సాయంత్రం 5.10 గంటల సమయంలో రోడ్డుమార్గంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి నివాసానికి బయలుదేరారు. సాయంత్రం 5.20 గంటల సమయంలో ఎమ్మెల్యే లలితకుమారి నివాసంలోకి అడుగెట్టారు.

- సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నట్లు సమాచారం వచ్చిన సమయం నుంచి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ దాదాపు 600 మంది పోలీస్‌ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ ఎస్‌.రామసుందర్‌ రెడ్డి క్షేత్రస్థాయిలో వుండి పర్యవేక్షించారు.

Updated Date - Aug 23 , 2026 | 12:14 AM