అలుగుబిల్లి రోడ్డు ఛిద్రం
ABN , Publish Date - Mar 13 , 2026 | 12:43 AM
మండ లంలోని అలుగుబిల్లి రోడ్డును గ్రామంలో ఉన్న క్వారీలు, క్రషర్లకు చెందిన వాహనాలు ఛిద్రం చేశాయి.
అధికలోడుతో భారీ వాహనాల రాకపోకలు
గోతులమయంగా మారిన రోడ్డు
మరమ్మతులకు గురవుతున్న వాహనాలు
క్వారీ వాహనాలపై టార్పాలిన్లు కప్పని వైనం
ఇబ్బంది పడుతున్న వాహనచోదకులు
ఎస్.కోట రూరల్, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): మండ లంలోని అలుగుబిల్లి రోడ్డును గ్రామంలో ఉన్న క్వారీలు, క్రషర్లకు చెందిన వాహనాలు ఛిద్రం చేశాయి. ఈ క్వారీ లు, క్రషర్లకు చెందిన భారీ వాహనాలు అధిక లోడుతో రాకపోకలు సాగించడంతో ఈ రోడ్డంతా గోతులమయం గా తయారయ్యింది. ఈ రోడ్డును రెండేళ్ల కిందటే రూ.కోటి 80లక్షలతో నిర్మించారు. నిర్మించిన ఏడాదికే క్వారీ లారీల కారణంగా ఈ రోడ్డు పాడయ్యింది. దీంతో మూడు నెలల కిందట మరో రూ.ఆరు లక్షలతో రోడ్డు ను మరమ్మతులు చేశారు. అయినా మళ్లీ పాడైంది. విశాఖ జిల్లా, అల్లూరి జిల్లా నుంచి ఇక్కడ రాతి పిక్క కు, బుగ్గికి పెద్దపెద్ద లారీలతో వస్తున్నారు. వీరు తమ లారీల్లో వేయాల్సిన పరిమిత కంటే పది నుంచి 20 టన్నుల అధిక బరువు వేయడంతో రోడ్డు కుచించుకు పోతోంది. అదేవిధంగా అధిక లోడు పిక్క తీసుకెళ్లే లారీ లపై టార్పాలిన్లు కూడా లేకుండా ఈ పిక్కలు ఆటోల పై వెళ్లే విద్యార్థులపైన, ఈ దారిలో నడిచివెళ్లే రైతుల పైన పడుతున్నాయి. కొద్దిరోజుల కిందట అధిక బరువు తో వెళ్లే వాహనాలపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ దామోదర్ ఆదేశాలు ఇచ్చినా అమలు కావడం లేదు. అదే విధంగా ఇక్కడ నుంచి ప్రతిరోజు వేకువజాము నుంచి ఉదయం 11గంటల వరకు అధికలోడుతో వాహనాలు వెళ్తున్నా రవాణా శాఖ చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. తమ గ్రామానికి ప్రభుత్వం ఎప్పటిక ప్పుడు రోడ్లు వేస్తున్నా ఈ క్వారీల వల్ల నాశనం అవు తున్నాయని స్థానికులు వాపోతున్నారు. రోడ్డంతా గుంతలమయం కావడంతో తమ వాహనాలు ఎప్పటి కప్పుడే పాడవుతున్నాయని, అలాగే తమకు ఒళ్లు నొప్పు లు వస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక లోడుతో వాహనాల రాకపోకలను నిలుపుదల చేయాలని వారు కోరుతున్నారు.