Share News

Alternative Crops ప్రత్యామ్నాయ పంటలతో మేలు

ABN , Publish Date - Aug 05 , 2026 | 12:06 AM

Alternative Crops Offer Better Returns ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం శ్రేయస్కరమని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. దీనిపై జిల్లాలో అన్నదాతలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వ్యవసాయ అనుబంధ శాఖలు, ఐటీడీఏ అధికారులతో సమీక్షించారు.

Alternative Crops   ప్రత్యామ్నాయ పంటలతో మేలు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

పార్వతీపురం, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం శ్రేయస్కరమని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. దీనిపై జిల్లాలో అన్నదాతలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వ్యవసాయ అనుబంధ శాఖలు, ఐటీడీఏ అధికారులతో సమీక్షించారు. లాభదాయక వ్యవసాయ పద్ధతులపై రైతు సేవా కేంద్రాల్లో రోజూ శిక్షణ ఇవ్వాలన్నారు. క్రాప్‌ ఇన్సూరెన్స్‌ను వందశాతం పూర్తి చేసి ప్రతి రైతుకు బీమా ధ్రువపత్రం అందించాలని సూచించారు. కౌలు రైతులందరికీ పంట రుణాలు, బీమా సౌకర్యం కల్పించాలన్నారు. గట్టుపై చెట్టు కార్యక్రమంలో భాగంగా పొలం గట్లు నాలుగు అడుగుల వెడుల్ప ఉండేలా అవగాహన కల్పించాలన్నారు. సాలూరులో చిరుధాన్యాల విలువ ఆధారిత ఉత్పత్తుల ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. దీనివల్ల 200 మంది స్వయం సహాయక సంఘ సభ్యులు , 40 వేల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. జీడి తోటల్లో అంతర పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. చెరువుల్లో చేపల పెంపకానికి ప్రణాళిక సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

పార్వతీపురం టౌన్‌: జిల్లాలో చిన్నారులు, గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ నుంచి జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా ఉమన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ అధికారులతో సమీక్షించారు. ఆరేళ్ల లోపు చిన్నారుల ఆరోగ్య భద్రత, పోషకాహార స్థితిగతులపై పర్యవేక్షణ ఉండాలన్నారు. గర్భిణులతో పాటు పిల్లలకు పూర్తిస్థాయిలో పౌష్టికాహారం అందించాలని సూచించారు. పౌష్టికాహార లోపాన్ని అధిగమించాలన్నారు. వయసుకు తగ్గ ఎత్తు, బరువు పెరగని పిల్లలను ప్రత్యేకంగా పరిశీలిం చాలని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా వారికి క్రమం తప్పకుండా పౌష్టికాహారం అందించడంతో పాటు తగు వైద్య సేవలు అందిం చాలన్నారు. క్షేత్రస్థాయిలో అంగన్‌వాడీల సేవలను పర్యవేక్షిం చాలని సూచించారు. మాస్టర్‌ ట్రైనీలను సిద్ధం చేసి వారికి ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని ఐసీడీఎస్‌ పీడీ కనకదుర్గకు ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - Aug 05 , 2026 | 12:06 AM