Share News

Tribal Village ప్రతి గిరిజన గ్రామానికీ పక్కా రహదారి

ABN , Publish Date - Jan 28 , 2026 | 11:46 PM

All-Weather Roads for Every Tribal Village జిల్లాలో ప్రతి మారుమూల గిరిజన గ్రామానికి పక్కా రహదారి సదుపాయం కల్పించి.. డోలీ మోతలు తప్పించడమే సర్కారు ధ్యేయమని ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి, కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. కొమరాడ మండలంలోని పదకొండు గిరిశిఖర గ్రామాల్లో సుమారు రూ.23.44 కోట్లతో 60 బీటీ రోడ్లు నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు.

  Tribal Village  ప్రతి గిరిజన గ్రామానికీ పక్కా రహదారి
ఎక్స్‌కవేటర్‌తో పనులు ప్రారంభిస్తున్న కలెక్టర్‌, ప్రభుత్వ విప్‌

కొమరాడ, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రతి మారుమూల గిరిజన గ్రామానికి పక్కా రహదారి సదుపాయం కల్పించి.. డోలీ మోతలు తప్పించడమే సర్కారు ధ్యేయమని ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి, కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. కొమరాడ మండలంలోని పదకొండు గిరిశిఖర గ్రామాల్లో సుమారు రూ.23.44 కోట్లతో 60 బీటీ రోడ్లు నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. బుధవారం తీగలపాడు-జొప్పంగి గ్రామ రోడ్డు నిర్మాణానికి వారు శంకుస్థాపన చేశారు. కలెక్టర్‌ స్వయంగా ఎక్స్‌కవేటర్‌ను నడిపి పనులకు శ్రీకారం చుట్టారు. ముందుగా మసిమండ, పెద్దశాఖ కూడలి నుంచి తీగలపాడు, జొప్పంగి వరకు గిరిజనులు డప్పు వాయిద్యాలు, నృత్య ప్రదర్శనలతో వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. రోడ్లు నిర్మాణం పూర్తయితే గిరిజన గ్రామాలకు రాకపోకలు సులభతరమవుతాయన్నారు. రవాణా కష్టాలు తప్పుతాయని, అత్యవసర సమయాల్లో త్వరిగతిన వైద్య సేవలు పొందగలరని తెలిపారు. అనం తరం ఆయన ప్రభుత్వ విప్‌ జగదీశ్వరితో కలిసి పూర్ణపాడు-లాబేసు వంతెనను పరిశీలించారు. ఏడాదిలో దీని పనులు పూర్తి చేసి తొమ్మిది పంచాయతీవాసుల ఇబ్బందులు తొలగిస్తామని వారు చెప్పారు. అనంతరం పెండింగ్‌ పనుల వివరాలను కలెక్టర్‌ సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. టెండర్‌ ప్రక్రియ త్వరగా పూర్తి చేసి పనులు చేపట్టాలని ఆదేశించారు. ఈ పర్యటనలో జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, సబ్‌ కలెక్టర్‌ ఆర్‌.వైశాలి తదితరులు ఉన్నారు.

Updated Date - Jan 28 , 2026 | 11:46 PM