Share News

లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాల కేటాయింపు

ABN , Publish Date - Oct 08 , 2026 | 11:38 PM

లాటరీ పద్ధతి ద్వారా జిల్లాలో 9 మద్యం దుకాణాలు కేటాయించినట్లు జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ సహదేవుడు తెలిపారు.

  లాటరీ పద్ధతిలో  మద్యం దుకాణాల కేటాయింపు
జేసీ వైశాలీ పర్యవేక్షణలో లాటరీ తీస్తున్న దృశ్యం

పార్వతీపురంటౌన్‌, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): లాటరీ పద్ధతి ద్వారా జిల్లాలో 9 మద్యం దుకాణాలు కేటాయించినట్లు జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ సహదేవుడు తెలిపారు. 2026-27కు గాను ప్రోహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ చట్టం ప్రకారం గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జాయింట్‌ కలెక్టర్‌ వైశాలి పర్యవేక్షణలో లాటరీ నిర్వహించారు. పార్వతీపురం పట్టణంలో 2, రూరల్‌ 1, సాలూరు మున్సిపాల్టీలో 3, రూరల్‌ 1, పాలకొండ రూరల్‌ 1, సీతానగరం మండలంలో ఒక దుకాణానికి సంబంధించి 45 దరఖాస్తులు రాగా, 9మందిని లాటరీ ద్వారా ఎంపిక చేసినట్లు తెలిపారు.

Updated Date - Oct 08 , 2026 | 11:39 PM