అల్లివలస తీరానికి చేరిన మృతదేహం
ABN , Publish Date - Jun 02 , 2026 | 12:12 AM
పూసపాటిరేగ మండలం కొత్తూరుకు చెందిన బర్రి అమ్మోరు మృతదేహం సోమవారం అల్లివలస తీరానికి చేరింది.
రణస్థలం, జూన్ 1(ఆంధ్రజ్యోతి): పూసపాటిరేగ మండలం కొత్తూరుకు చెందిన బర్రి అమ్మోరు మృతదేహం సోమవారం అల్లివలస తీరానికి చేరింది. జేఆర్‌పురం ఎస్‌ఐ ఎస్.చిరంజీవి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బర్రె అమ్మోరుతో కలసి శని వారం చింతపల్లి సముద్ర స్నానానికి లక్ష్మణ, ఆయన సోదరి వెళ్లారు. సముద్రపు కెరటాలకు కొట్టుకుపోతున్న లక్ష్మణను కాపాడేందుకు అమ్మోరు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో లక్ష్మణతో పాటు అమ్మోరు సముద్రంలో గల్లంతయ్యారు. లక్ష్మణ మృత దేహాం ఆదివారం కొవ్వాడ తీరానికి చేరగా, బర్రి అమ్మోరు మృత దేహాం సోమవారం అల్లివలస తీరానికి చేరింది. స్థానికుల సమాచారం మేరకు మృతదే హాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.