Share News

ఎంపీటీసీలు కూటమి కైవసం

ABN , Publish Date - Nov 08 , 2026 | 01:06 AM

పార్వతీపురం మన్యం జిల్లాలోని 15 మం డలాల్లో ఎంపీటీసీలను కూటమి కైవసం చేసు కుంది. శనివారం జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ పాలకొండ, పార్వతీపురం, సాలూరు, గరుగుబిల్లి మండలంలోని ఉల్లిభ ద్రలో నిర్వహించారు. అయితే వైసీపీ ఏ ఒక్క మండలంలోనూ ప్రభావం చూపలేకపోయింది.

 ఎంపీటీసీలు కూటమి కైవసం

పార్వతీపురం మన్యం జిల్లాలోని 15 మం డలాల్లో ఎంపీటీసీలను కూటమి కైవసం చేసు కుంది. శనివారం జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ పాలకొండ, పార్వతీపురం, సాలూరు, గరుగుబిల్లి మండలంలోని ఉల్లిభ ద్రలో నిర్వహించారు. అయితే వైసీపీ ఏ ఒక్క మండలంలోనూ ప్రభావం చూపలేకపోయింది.

ఫ జియ్యమ్మవలస, నవంబరు 7 (ఆంధ్ర జ్యోతి): మండలంలోని 15 ఎంపీటీసీ స్థానాల కు టీడీపీ 14, వైసీపీ ఒకటి గెలుపొందాయి.

ఫపాలకొండ, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): మండలంలో 12 ఎంపీటీసీలకు గాను టీడీపీ ఏడు, జనసేన నాలుగు స్థానాలను గెలుచుకు న్నారు. వైసీపీ ఒక్క టీసీకే పరిమితమైంది.

ఫసాలూరు, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): సాలూరు మండలంలో 16 ఎంపీటీసీ స్థానాలకు గాను తొమ్మిది స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, ఏడు చోట్ల వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు.

ఫకురుపాం, నవంబరు7(ఆంధ్రజ్యోతి): మం డలంలోని 14 ఎంపీటీసీలకు ఎనిమిది టీడీపీ గెలుపొందింది. జనసేన,బీజేపీ చెరొకటి చొప్పున, వైసీపీ నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. ఫపాచిపెంట రూరల్‌, నవంబరు 7 (ఆంధ్ర జ్యోతి): మండలంలోని 14 ఎంపీటీసీలకు పది టీడీపీ అభ్యర్థులు కైవసం చేసుకోగా నాలుగు వైసీపీ అభ్యర్థులు గెలుచుకున్నారు.

ఫభామిని, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): మండలంలో 13 ఎంపీటీసీలకు టీడీపీ ఆరు, జనసేన ఐదు, వైసీపీ రెండు గెలుచుకున్నాయి.

ఫ వీరఘట్టం, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): మండలంలో 19 ఎంపీటీసీ స్థానాలకు 13 జనసేన, మూడు టీడీపీ, మరో మూడు వైసీపీ గెలుపొందాయి.

ఫ గరుగుబిల్లి, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): మండలంలోని 13 ప్రాదేశికాల్లో 8 ప్రాదేశికాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, రెండు జనసేన, మూడు ప్రాదేశికాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు.

ఫపార్వతీపురం రూరల్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): మండలంలో 17 ఎంపీటీసీలకు టీడీపీ 13, మూడు స్థానాలను వైసీపీ, ఒక స్థానంలో జనసేన విజయం సాధించాయి.

ఫసీతానగరం, నవంబరు 7 (ఆంధ్రజ్యో తి): మండలంలోని 17 ఎంపీటీసీ స్థానాలను 13 స్థానాలను టీడీపీ, ఒకటి జనసేన పార్టీ కైవసం చేసుకున్నాయి. మరో మూడు స్థానాలు వైసీపీ గెలుపొందాయి.’

Updated Date - Nov 08 , 2026 | 01:06 AM