Share News

భూ సేకరణలో అవకతవకలు జరుగుతున్నాయంటూ..

ABN , Publish Date - Nov 17 , 2026 | 12:20 AM

ఉంగరాడమెట్టలో ఎస్‌ఎంఎస్‌ఈ పార్కు ఏర్పాటుకు చేస్తున్న భూసేకరణలో అవక తవకలు జరుగుతు న్నాయంటూ ఆమదా లవలస కాలనీకి చెందిన కుమిలి అప్పయ్య కుటుంబం సోమవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిరసన చేపట్టింది.

భూ సేకరణలో అవకతవకలు జరుగుతున్నాయంటూ..

  • ఓ కుటుంబం నిరసన.. పెట్రోల్‌తో ఒకరు హల్‌చల్‌

రేగిడి, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): ఉంగరాడమెట్టలో ఎస్‌ఎంఎస్‌ఈ పార్కు ఏర్పాటుకు చేస్తున్న భూసేకరణలో అవక తవకలు జరుగుతు న్నాయంటూ ఆమదా లవలస కాలనీకి చెందిన కుమిలి అప్పయ్య కుటుంబం సోమవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిరసన చేపట్టింది. ఈ మేరకు అప్పయ్య కుమారుడు సింహాచలం ఏకంగా పెట్రోల్‌తో హల్‌చల్‌ చేసి, ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. దీంతో అక్కడ ఉన్నవారితో పాటు తహసీల్దార్‌ ఈశ్వరరావు వచ్చి, నచ్చజెప్పారు. దీంతో సింహాచలం ఆ ప్రయత్నం విరమించాడు.

ఈ వ్యవహారంపై తహసీల్దార్‌ ఈశ్వరరావు మాట్లాడుతూ.. రేగిడి ఎంఎస్‌ఎంఈ పార్కుకు సేకరించిన భూమికి సంబంధించి 23 మంది లబ్ధిదారులకు ఎకరాకు రూ.25లక్షల చొప్పున వారి బ్యాంకు అకౌంట్‌లో జమ అయ్యాయని తెలిపారు. అయితే అప్పయ్య ఒక్కరే ఇంతవరకు తమను సంప్ర దించలేదని చెప్పారు. మిగతా లబ్ధిదారులను ఇటీవల విచారించగా, ఎటువంటి అవకతవకలు జరగలేదని వారు స్టేట్‌మెంట్‌ ఇచ్చారని ఆయన తెలిపారు.

Updated Date - Nov 17 , 2026 | 12:20 AM