Share News

All Tribal Villages Should Be Developed గిరిజన గ్రామాలన్నీ అభివృద్ధి చెందాలి

ABN , Publish Date - Apr 23 , 2026 | 11:26 PM

All Tribal Villages Should Be DevelopedAll గిరిజన గ్రామాలన్ని అభివృద్ధి చేందాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గురువారం కురసంగిలో గ్రామ ముస్తాబు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణతో కలిసి ప్రారంభించారు.

All Tribal Villages Should Be Developed గిరిజన గ్రామాలన్నీ  అభివృద్ధి చెందాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

సీతంపేట రూరల్‌, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): గిరిజన గ్రామాలన్ని అభివృద్ధి చేందాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గురువారం కురసంగిలో గ్రామ ముస్తాబు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామాన్ని ముస్తాబు చేసిన తీరును కలెక్టర్‌ పరిశీలించారు. అంతకుముందు కలెక్టర్‌తో పాటు ఎమ్మెల్యే, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్‌ జగన్నాథ్‌లకు ఆ గ్రామస్థులు గిరిజన సంస్కృతి, సంప్రదాయ నృత్యాలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్‌ గ్రామంలో పాఠశాలను పరిశీలించి అక్కడ చదువుతున్న చిన్నారులతో ముచ్చటించారు. పోషణపక్వాడ్‌లో భాగంగా గర్భిణులకు సీమంతాలు నిర్వహించారు. గ్రామాలను శుభ్రంగా, అందంగా ఆరోగ్యకరంగా మార్చడమే ముస్తాబు కార్యక్రమం ఉద్దేశ్యమని కలెక్టర్‌ అన్నారు. ఎమ్మెల్యే చొరవతో నియోజకవర్గంలో రహదారి అభివృద్థి పనులు జరుగుతున్నాయని గుర్తుచేశారు. సూర్యమండలం పేరుతో వివిధ రకాల కూరగాయలు సాగు చేయడం స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఎమ్మెల్యే జయకృష్ణ మాట్లాడుతూ.. మారుమూల ఉన్న కురసింగి గ్రామాన్ని ముస్తాబు చేయడంలో గ్రామస్థుల కృషి ఎంతగానో ఉందన్నారు.

Updated Date - Apr 23 , 2026 | 11:26 PM