Festival పసుపు పండుగకు సర్వం సిద్ధం
ABN , Publish Date - May 26 , 2026 | 11:53 PM
All Set for the Turmeric Festival పసుపు పండుగకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి నిర్వహించనున్న మహానాడు కార్యక్రమానికి మన్యం ముస్తాబైంది. టీడీపీ అధిష్ఠానం ఆదేశాల మేరకు జిల్లాలో తొలిసారిగా క్లస్టర్ల వారీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్టీ నేతలు, కార్యకర్తలు సన్నద్ధమయ్యారు. నియోజకవర్గాల వారీగా వేదికలు, భారీ స్ర్కీన్లు, సౌండ్ సిస్టమ్ తదితర వాటిని ఏర్పాటు చేశారు.
42 క్లస్టర్ల పరిధిలో నిర్వహణ
ఎక్కడికక్కడ భారీ స్ర్కీన్లు
ఏర్పాట్లు పూర్తి చేసిన టీడీపీ శ్రేణులు
పార్వతీపురం, మే26(ఆంధ్రజ్యోతి): పసుపు పండుగకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి నిర్వహించనున్న మహానాడు కార్యక్రమానికి మన్యం ముస్తాబైంది. టీడీపీ అధిష్ఠానం ఆదేశాల మేరకు జిల్లాలో తొలిసారిగా క్లస్టర్ల వారీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్టీ నేతలు, కార్యకర్తలు సన్నద్ధమయ్యారు. నియోజకవర్గాల వారీగా వేదికలు, భారీ స్ర్కీన్లు, సౌండ్ సిస్టమ్ తదితర వాటిని ఏర్పాటు చేశారు. మొత్తంగా జిల్లాలోని సాలూరు, పార్వతీపురం, పాలకొండ, కురుపాం నియోజకవర్గాల్లో 42 క్లస్టర్ల పరిధిలో ఈనెల 27, 28 తేదీల్లో మహానాడు నిర్వహించేందుకు తెలుగు తమ్ముళ్లు సమాయత్తమయ్యారు. కాగా పార్టీ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులతో పాటు పొలిట్‌బ్యూరో సభ్యులు, కార్యవర్గంలో ముఖ్య నాయకులు పార్టీ సెంట్రల్ కార్యాలయం నుంచే వర్చువల్‌గా ప్రసంగించనున్నారు. హైబ్రిడ్ మహానాడు కొద్ది గంటల్లో ప్రారంభం కానుండగా.. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగి ప్రతి కార్యక్రమాన్ని స్ర్కీన్లలో జిల్లానేతలు స్థానికంగా వీక్షించనున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు ప్రసంగం, యువనేత నారా లోకేష్ సందేశం, పార్టీ నాయకుల కీలక ఉపన్యాసాలు వినేందుకు తగిన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి.
సాలూరు నియోజకవర్గ పరిధిలో పది క్లస్టర్లు ఉండగా.. మహానాడు నిర్వహణపై ఇప్పటికే క్లస్టర్ ఇన్‌చార్జిలు, శ్రేణులకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు సాలూరు పట్టణంతో పాటు పాచిపెంట, మక్కువ, మెంటాడ మండలాల్లో ఈ కార్యక్రమం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇకపోతే మంత్రి సంధ్యారాణి బుధవారం మంగళగిరి పార్టీ సెంట్రల్ కార్యాలయంలో నిర్వహించే మహానాడు వేదికలో ప్రసంగించనున్నారు. పార్వతీపురం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో పసుపు పండుగ నిర్వహిం చనున్నారు. ఈ మేరకు పార్వతీపురం పట్టణం, మండలంలో పాటు బలిజిపేట, సీతానగరం పరిధిలోని 11 క్లస్టర్లలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే పార్టీ పరిశీలకులు రాజబాబు నియోజకవర్గ ముఖ్య నాయకులు ఎమ్మెల్యేతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మహానాడు ఏర్పాట్లపై పలు సూచనలిచ్చారు. కురుపాం నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి ఆధ్వర్యంలో 11 క్లస్టర్లు పరిధిలో మహానాడు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లపై పార్టీ పరిశీలకుడు ఎం.వెంకటేష్‌తో పాటు విప్ జగదీశ్వరి ఇప్పటికే నియోజకవర్గ కస్టర్ ఇన్‌చార్జిలకు దిశా నిర్దేశం చేశారు. పాలకొండ నియోజకవర్గంలో టీడీపీ ఇన్‌చార్జి పడాల భూదేవి ఆధ్వర్యంలో పది క్లస్టర్లు పరిధిలో మహానాడు జరగనుంది. పార్టీ పరిశీలకులు ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ పర్యవేక్షణలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇదిలా ఉండగా క్లస్టర్ల పరిధిలో నిర్వహించే మహానాడు కార్యక్రమంలో నియోజకవర్గాల వారీగా సమస్యలపై ప్రస్తావించి తీర్మానం చేయనున్నారు. వాటిని పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లనున్నారు.