Share News

Tenth Examinations టెన్త్‌ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు

ABN , Publish Date - Feb 24 , 2026 | 12:22 AM

All Set for the Tenth Grade Examinations జిల్లాలో మార్చి 16 నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని డీఆర్వో కె.హేమలత ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సమన్వయకమిటీ సమావేశం నిర్వహించారు.

 Tenth   Examinations  టెన్త్‌ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు
సమావేశంలో మాట్లాడుతున్న డీఆర్‌వో

పార్వతీపురం, ఫిబ్రవరి23(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మార్చి 16 నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని డీఆర్వో కె.హేమలత ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సమన్వయకమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె సంబంధిత అధికారులతో మాట్లాడుతూ.. ‘2022-23 నుంచి వరుసగా మూడుసార్లు రాష్ట్ర స్థాయిలో జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది కూడా మన జిల్లా మొదటి స్థానంలో నిలిచేలా అధికారులు కృషి చేయాలి. సుమారు 10,646 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. 68 పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్‌, మరుగుదొడ్లు వంటి మౌలిక సదు పాయాలు కల్పించాలి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలి. ఉద యం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పటిష్ఠ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయాలి. 144 సెక్షన్‌ అమలు చేయాలి. పరీక్షా పేపర్లను స్ర్టాంగ్‌ రూంలో భద్రపరిచి.. సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి. ఆర్టీసీ బస్సులు సమయానుకూలంగా నడపాలి. పరీక్ష కేంద్రాల వల్ల 108 అంబులెన్స్‌, తాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలి.’ అని తెలిపారు. ఈ సమావేశంలో డీఈవో బ్రహ్మాజీరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 24 , 2026 | 12:22 AM