Kothapolamma కొత్తపోలమ్మ మహోత్సవాలకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Apr 20 , 2026 | 12:19 AM
All Set for the Grand Kothapolamma Festival Celebrations జిల్లా కేంద్రంలో కొత్తవలస గ్రామ ప్రజల ఇలవేల్పు, కోర్కేలు తీర్చే కల్పవల్లి కొత్తపోలమ్మ మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఏడేళ్ల అనంతరం అందరి సహకారంతో ఈ వేడుకులు నిర్వహిస్తున్నట్లు ఆదివారం కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు తెలిపారు.
పార్వతీపురం టౌన్, ఏప్రిల్19(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో కొత్తవలస గ్రామ ప్రజల ఇలవేల్పు, కోర్కేలు తీర్చే కల్పవల్లి కొత్తపోలమ్మ మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఏడేళ్ల అనంతరం అందరి సహకారంతో ఈ వేడుకులు నిర్వహిస్తున్నట్లు ఆదివారం కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు తెలిపారు. ఆనవాయితీ ప్రకారం.. 22 నుంచి 27 వరకు ప్రకారం పురవీధుల్లో ఘాటాలు ఊరేగింపు ఉంటుందన్నారు. 26న సాయంత్రం 5 గంటలకు ఉయ్యాల కంబాల ఉత్సవం నిర్వహిస్తామని వెల్లడించారు. అనంతరం అమ్మవారి ఘటాల ఊరేగింపుతో రాజుగారి కోటకు వెళ్తామన్నారు. 28న సాయంత్రం 5 గంటల నుంచి అనుపు పండుగ చేపడతామని తెలిపారు. పట్టణ ప్రజలందరూ కొత్తపోలమ్మను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని వారు కోరారు. ఇదిలా ఉండగా అమ్మవారి దేవాలయంతో పాటు ప్రధాన వీధులన్నీ విద్యుత్ కాంతులతో కళకళలాడుతున్నాయి. బంధువులు, స్నేహితులతో కొత్తవలస సందడిగా మారింది. భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.