Shambara Maru Jatara శంబర మారు జాతరకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Feb 03 , 2026 | 12:07 AM
All Set for Shambara Maru Jatara ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం, కోర్కెలు తీర్చే కల్పవల్లి శంబర పోలమాంబ మారుజాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం నిర్వహించే ఉత్స వాలకు రెండు లక్షలకుపైగా భక్తులు రానున్నట్లు అంచనా.
ఏర్పాట్లు పూర్తి
మక్కువ రూరల్, ఫిబ్రవరి2(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం, కోర్కెలు తీర్చే కల్పవల్లి శంబర పోలమాంబ మారుజాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం నిర్వహించే ఉత్స వాలకు రెండు లక్షలకుపైగా భక్తులు రానున్నట్లు అంచనా. జిల్లానలుమూలల నుంచే కాకుండా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ర్టాల నుంచి ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున ముందస్తుగా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని ఈవో బి.శ్రీనివాస్, ట్రస్ట్ బోర్డు చైర్మన్ చినతిరుపతి సోమవారం తెలిపారు. చదురుగుడి , వనం గుడివద్ద ప్రత్యేక క్యూలైన్లతో పాటు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. భక్తుల తాగునీటి కోసం మొబైల్ నీటి ట్యాంక్‌లను సిద్ధం చేశారు. 15 వేల లడ్డూలను తయారుచేయిస్తున్నారు. మరోవైపు శంబరకు సుమారు 25 వరకు ఆర్టీసీ బస్సులు నడపనున్నట్లు సాలూరు డిపో మేనేజర్ పి.ఆచారి తెలిపారు. మారుజాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 150 మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని మక్కువ ఎస్‌ఐ ఎం.వెంకటరమణ వెల్లడించారు. అమ్మవారికి మొక్కుబడులు, ముడుపులు చెల్లించేవారి కోసం ప్రత్యేక కౌంటర్లు, వాహనదారుల కోసం పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.