మోదీ పర్యటనకు సర్వం సన్నద్ధం
ABN , Publish Date - Aug 01 , 2026 | 12:39 AM
ప్రధాని మోదీ పర్యటనకు సర్వం సన్నద్ధమైందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు.
మంత్రి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి
విజయనగరం, జూలై 31(ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ పర్యటనకు సర్వం సన్నద్ధమైందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. శుక్రవారం రాత్రి విజయనగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద విలేకర్ల సమావేశం నిర్వ హించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్వ యంగా నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో విమానాశ్రయంపై పోస్టు చేయడం ఆనందం కలిగిస్తుందన్నారు. థింసా నృత్యంతో ప్రధానికి స్వాగతం పలుకుతున్నట్టు తెలిపా రు. భోగాపురం విమానాశ్రయం విషయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అబద్దాలు చెబుతున్నార న్నారు. ఎర్రబస్సు రాని చోట విమానాశ్రయం ఎందుకని ఒకసారి, విశాఖపట్నంలో విమానాశ్రయం ఉంటుండగా 35 కిలోమీటర్ల దూరంలో మరొకటి ఎందుకని జగన్మో హన్‌రెడ్డి రకరకాలుగా ప్రకటనలు చేసి, ఇప్పుడేమో క్రెడిట్ చోరీకి ప్రయత్నిస్తున్నారన్నారు. అనంతరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ భోగాపురం ఎయిర్‌పోర్టు రాకతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారను న్నాయన్నారు. ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు విడుచు కుంటాయన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు విషయమై జగన్ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు.
‘ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి’
విజయనగరం కలెక్టరేట్, జూలై 31(ఆంధ్ర జ్యోతి): ప్రధాని నరేంద్రమోదీ పర్యటనకు సంబంధించి ప్రజలకు రవాణా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కొండ పల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రవాణా శాఖ కమిషనర్ బాలసు బ్రహ్మణ్యం, డైరక్టర్ ఆఫ్ సర్వే సెటిల్మెంట్ రోనంగి కూర్మనాథంతో ప్రత్యేక సమీక్ష నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. శనివారం ఉదయం 7 గంటలకు బస్సులన్నీ సభా ప్రాంగణానికి చేరుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 4734 బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటిద్వారా 2,15,500 మంది ప్రజా నీకం సభకు హాజరు కానుందని చెప్పారు. షెడ్యూల్ ప్రకారం వారంతా సభ వద్దకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వా హనాల్లో వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ప్రత్యేక యాప్ ద్వారా ఏ బస్సు ఎక్కడ ఉందో తెలుసుకునే విధంగా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన ట్లు అధికారులు మంత్రికి తెలిపారు.