Intermediate Examinations ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Feb 22 , 2026 | 11:59 PM
All Set for Intermediate Examinations ఇంటర్ పబ్లిక్ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం నుంచి మార్చి 24 వరకు ఈ పరీక్షలు జరగనుండగా.. ఇందుకోసం జిల్లాలో 33 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యా ర్థులు 8787 మంది , ద్వితీయ సంవత్సరం నుంచి 8743 మంది విద్యార్థులు హాజరు కానున్నారు.
పార్వతీపురం/బెలగాం/సాలూరు రూరల్, ఫిబ్రవరి22(ఆంధ్రజ్యోతి): ఇంటర్ పబ్లిక్ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం నుంచి మార్చి 24 వరకు ఈ పరీక్షలు జరగనుండగా.. ఇందుకోసం జిల్లాలో 33 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యా ర్థులు 8787 మంది , ద్వితీయ సంవత్సరం నుంచి 8743 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. మాస్ కాపీయింగ్, ఇతర అవకతవకలకు వీలులేకుండా అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. చీఫ్ సూపరింటెండెంట్లు, ఫ్లైయింగ్, సిట్టింగ్ స్క్వాడ్, బృందాలు, డిపార్ట్‌మెంట్ అధికారులు ఈ పరీక్షలను పర్యవేక్షించనున్నాయి. ‘ పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశాం ఫర్నిచర్, తాగునీరు, వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాం. కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు నిషేఽధం. అఽధికారులు, ఇన్విజిలేటర్లు, పోలీస్, వైద్య సిబ్బంది, స్క్వాడ్ అధికారులు, ఇతర సిబ్బంది ఎవరూ సెల్‌ఫోన్లు, ఎలక్ర్టానిక్ పరికరాలు తీసుకురాకూడదు. స్క్వాడ్ సిబ్బంది సైతం సెల్‌ఫోన్‌తో వెళ్లకూడదు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనుండగా.. విద్యార్థులు నిర్ణీత సమయానికి కంటే ముందుగానే కేంద్రాల్లోకి చేరుకోవాలి. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోం. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. పరీక్ష సమయంలో జిరాక్స్, ఇంటర్నెట్ సెంటరు మూసివే యాల్సి ఉంది. ’ అని డీఐఈవో నాగేశ్వరరావు తెలిపారు. కాగా గురుకుల, ఆశ్రమ, జ్యోతిరావు పూలే గురుకులాల నుంచి విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు తరలించడానికి 14 బస్సులను నడుపు తున్నట్టు జిల్లా ఆర్టీసీ డీటీపీవో ( జిల్లా ప్రజారవాణాధికారి ) కె.శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్వతీపురం డిపో నుంచి ఏడు, సాలూరు నుంచి నాలుగు, పాలకొండ నుంచి మూడు బస్సులను ప్రత్యేకంగా నడపనున్నట్టు చెప్పారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. భవిష్యత్‌కు ఈ పరీక్షలు ఎంతో కీలకమన్నారు. కాపీయింగ్ వంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.