Independence Day పంద్రాగస్టు వేడుకలకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Aug 15 , 2026 | 12:02 AM
All Set for Independence Day Celebrations స్వాతంత్య్ర వేడుకకు పార్వతీపురంలోని జూనియర్ కళాశాల మైదానంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం ఉదయం 9 గంటలకు గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.
జాతీయ జెండాను ఆవిష్కరించనున్న మంత్రి సంధ్యారాణి
పార్వతీపురం/బెలగాం, ఆగస్టు14(ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర వేడుకకు పార్వతీపురంలోని జూనియర్ కళాశాల మైదానంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం ఉదయం 9 గంటలకు గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. శుక్రవారం కళాశాల మైదానంలో పోలీసులు మాక్ పరేడ్ నిర్వహించారు. ఏర్పాట్లును కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి పరిశీలించారు. హర్‌ఘర్ తిరంగాలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని, ఐక్యతను చాటి చెప్పాలన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విద్యుత్ దీపాలతో కలెక్టర్ కార్యాలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. జాతీయ జెండా రంగుల లైట్లతో కలెక్టరేట్‌కు కొత్తశోభ వచ్చింది.