Share News

Dolotsavam లివిరిలో డోలోత్సవాలకు సర్వం సిద్ధం

ABN , Publish Date - Mar 02 , 2026 | 12:35 AM

All Set for Dolotsavam Celebrations in Leviri ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతం.. లివిరి వంశధశార నదీతీరంలో వెలిసిన గోపీనాఽథ రాధాకృష్ణ డోలోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు భక్తుల రద్దీ దృష్ట్యా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

  Dolotsavam  లివిరిలో డోలోత్సవాలకు సర్వం సిద్ధం
లివిరిలో గోపీనాథుడు

భామిని, మార్చి 1(ఆంధ్రజ్యోతి): ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతం.. లివిరి వంశధశార నదీతీరంలో వెలిసిన గోపీనాఽథ రాధాకృష్ణ డోలోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు భక్తుల రద్దీ దృష్ట్యా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏటా డోలో పౌర్ణమి ముందు రోజు మాఘ (కామదహనం) చేపట్టి ఉత్సవాలు ప్రారంభించడం ఆనవాయితీ. దీనిలో భాగంగా సోమవారం రాత్రి ఉత్సవ విగ్రహాలను ఊరేగించి మగా తోటలో కామదహనం చేపడతారు. మంగళవారం చంద్ర గ్రహణం కావడంతో సూర్యోదయం ముందుగానే ఆలయాన్ని మూసివేస్తారు. సాయంత్రం ఏడు గంటల తర్వాత ఆలయాన్ని శుద్ధి చేసి.. ప్రత్యేక పూజలు చేయనున్నట్లు వేద పండితులు సంతోష్‌ పండా, ఆలయ అర్చకులు గోపీనాధ్‌చౌదరి తెలిపారు. కాగా బుధవారం వంశధార నదిలో స్వామివారికి చక్రతీర్థస్నానాలు నిర్వహించ నున్నారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలకు ఈ ప్రాంతంతో పాటు ఒడిశా నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి.. గోపీనాథుడిని దర్శించుకోనున్నారు. ఎవరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ముందస్తు చర్యలు చేపట్టింది. మరోవైపు రాత్రి వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. కాగా పర్లాకిమిడి గజపతి రాజుల ఇష్టదైవమైన గోపీనాఽథస్వామి ఆలయానికి ఆదరణ కొరవడింది. దీంతో గ్రామస్థులు కమిటీలు వేసి.. దాతల వద్ద నుంచి విరాళాలు సేకరించి ఆలయ అభివృద్ధి చేపడుతున్నారు.

Updated Date - Mar 02 , 2026 | 12:35 AM