Share News

అన్ని శాఖలు ఏ ప్లస్‌ గ్రేడ్‌లో నిలవాలి

ABN , Publish Date - Apr 23 , 2026 | 11:22 PM

ప్రభుత్వ ప్రాధాన్యత సూచిల (కీ పెర్ఫార్మెన్స్‌ ఇండికేటర్స్‌) అమలులో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా అఽధికారులు పని చేయాలని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి ఆదేశించారు.

 అన్ని శాఖలు ఏ ప్లస్‌ గ్రేడ్‌లో నిలవాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి

-శతశాతం లక్ష్యాలను సాధించాలి

-కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి

విజయనగరం కలెక్టరేట్‌, ఏప్రిల్‌23 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ప్రాధాన్యత సూచిల (కీ పెర్ఫార్మెన్స్‌ ఇండికేటర్స్‌) అమలులో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా అఽధికారులు పని చేయాలని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్దేశించిన లక్ష్యాలను వందశాతం పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని అన్ని శాఖలు తప్పసరిగా ఏ ఫ్లస్‌ గ్రేడ్‌ సాధించాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ది పనులు క్షేత్ర స్థాయిలో ప్రజలకు చేరువ కావడంలో కేవీఐ కీలకమని, ఆయా సూచిల్లో వెనుకబడిన శాఖలు తక్షణమే పురోగతి సాధించాలన్నారు అంతకముందు ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ షియూష్‌ కుమారు అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్పరెన్స్‌లో కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పియూష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. 2026-27 సంవత్సరానికి సంబంధించి 396 ఇండికేటర్స్‌లో అత్యుత్తమ గ్రేడ్‌లను సాధించేందుకు ఆయా శాఖ అధికారులు కృషి చేయాలన్నారు. మండలాలకు నిర్దేశించిన 199 ఇండికేటర్స్‌ మెరుగైన పనితీరును ప్రదర్శించాలన్నారు. ఈ నెల 29 నాటికి అన్ని నివేదికలను సమగ్రంగా అందజేయాలన్నారు. 1,2,3 సవరించిన అంచనాలకు అనుగుణంగా మండలాల వారిగా అంచనాలను రూపొందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీపీవో బాలాజీ పాల్గొన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం పురష్కరించుకుని గురువారం సాయంత్రం ఆ శాఖ రూపొందించిన పోస్టర్‌, బ్యానర్‌ , కరపత్రాలను కలెక్టరు ఆవిష్కరించారు.

Updated Date - Apr 23 , 2026 | 11:22 PM