Share News

కొవిడ్‌పై అప్రమత్తం

ABN , Publish Date - Jul 22 , 2026 | 12:15 AM

కొవిడ్‌పై జిల్లా వైద్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టరు ఎస్‌.జీవనరాణి ఆదేశించారు. మంగళవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో జీఎంసీ, మిమ్స్‌ ప్రిన్సిపాల్‌, ఆసుపత్రి సూపరింటెండెంట్‌లు, డీసీహెచ్‌ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

కొవిడ్‌పై అప్రమత్తం
సమావేశంలో మాట్లాడుతున్న డీఎంహెచ్‌ఓ జీవనరాణి

  • కొవిడ్‌పై అప్రమత్తం

  • ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

  • అనుమానాస్పద లక్షణాలు కన్పిస్తే వైద్యుణ్ని సంప్రదించాలి

  • డీఎంహెచ్‌వో జీవనరాణి

విజయనగరం రింగురోడ్డు, జూలై 21( ఆంధ్రజ్యోతి): కొవిడ్‌పై జిల్లా వైద్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టరు ఎస్‌.జీవనరాణి ఆదేశించారు. మంగళవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో జీఎంసీ, మిమ్స్‌ ప్రిన్సిపాల్‌, ఆసుపత్రి సూపరింటెండెంట్‌లు, డీసీహెచ్‌ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో ప్రస్తుత పరిస్థితి నియంత్రణలో ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. చేతుల పరిశుభ్రత, శ్వాసకోశ పద్ధతులు పాటిస్తూ, అనుమానాస్పద లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలన్నారు. జిల్లా ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రిలో ఐసోలేషన్‌, ఆక్సిజన్‌ సదుపాయాలు కలిగిన పడకలు, ఐసీయూ బెడ్‌లు సిద్ధంగా వుండడంతో పాటు ఆక్సిజన్‌, పరీక్ష కిట్లు కూడా ఉన్నాయన్నారు. నిరంతర నిఘా, డేటా విశ్లేషణ, అనుమానిత క్లస్టర్‌లపై తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన సందర్భాల్లో ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీంలను సమన్వయం చేసి అనుమానాస్పద వ్యక్తుల నుంచి నమునాలను సేకరించాలన్నారు. జ్వరం, దగ్గు, గొంతునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వుంటే వైద్య సాయం పొందాలన్నారు. సమావేశంలో వైద్యశాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 22 , 2026 | 06:52 AM