Cyclone తుఫాన్‌పై అప్రమత్తం
ABN , Publish Date - Oct 26 , 2026 | 12:13 AM
Alertness Over Cyclone బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం.. సోమవారానికి తుఫాన్‌గా మారనుందని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదివారం ఒక ప్రకటనలో ఆదేశించారు. ప్రజలకు ఏ నష్టం జరగకుండా చూడాలని, తెగిపడిన విద్యుత్ తీగలు, వాగులు , గెడ్డల వద్దకు ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పార్వతీపురం, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం.. సోమవారానికి తుఫాన్‌గా మారనుందని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదివారం ఒక ప్రకటనలో ఆదేశించారు. ప్రజలకు ఏ నష్టం జరగకుండా చూడాలని, తెగిపడిన విద్యుత్ తీగలు, వాగులు , గెడ్డల వద్దకు ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అత్యవసరం అయితేనే జిల్లావాసులు ప్రయాణాలు చేయాలన్నారు. కలుషిత నీటిని తాగరాదన్నారు. లోతట్టు ప్రాంతవాసులు అధికారుల సూచనలు మేరకు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని తెలిపారు. తాగునీరు, ఆహారం, మందులు, టార్చ్‌లైట్లు, ముఖ్యమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారుల సలహాలు పొందాలని సూచించారు. ఎలాంటి ఆపద ఎదురైనా, లేదా సహాయం కావాలన్నా వెంటనే జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలన్నారు. జిల్లాలో విపత్తు నిర్వహణ కోసం ప్రత్యేక అధికారులను నియమించామని చెప్పారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక వదంతులు లేదా తప్పుడు సమాచారాన్ని నమ్మి ఆందోళన చెందొద్దన్నారు.