Share News

Malaria మలేరియాపై అప్రమత్తం

ABN , Publish Date - Oct 05 , 2026 | 11:07 PM

Alert Over Malaria రాష్ట్రస్థాయి మలేరియా బృందం సోమవారం రెండోరోజు సాలూరులో పర్యటించింది. రాష్ట్ర సంచాలకులు వీర్రాజు, కన్సల్టెంట్‌ రామచంద్ర, జోనల్‌ కార్యా లయ సహాయ సంచాలకులు మనోరమ తదితరులు ముందుగా సాలూరు ప్రాంతీయ ఆసుపత్రిని సందర్శించారు. మలేరియా, డెంగ్యూ కేసుల నమోదు, సీజనల్‌ వ్యాధుల పరిస్థితిని వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు.

 Malaria  మలేరియాపై అప్రమత్తం
సాలూరు ఏరియా ఆసుపత్రిలో రికార్డులు పరిశీలిస్తున్న రాష్ట్రస్థాయి బృందం

  • సాలూరులో పర్యటన

సాలూరు, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి మలేరియా బృందం సోమవారం రెండోరోజు సాలూరులో పర్యటించింది. రాష్ట్ర సంచాలకులు వీర్రాజు, కన్సల్టెంట్‌ రామచంద్ర, జోనల్‌ కార్యా లయ సహాయ సంచాలకులు మనోరమ తదితరులు ముందుగా సాలూరు ప్రాంతీయ ఆసుపత్రిని సందర్శించారు. మలేరియా, డెంగ్యూ కేసుల నమోదు, సీజనల్‌ వ్యాధుల పరిస్థితిని వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. మలేరియా కేసులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. వ్యాధి నియంత్రణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ల్యాబ్‌ రికార్డులను పరిశీలించి.. రోగులకు సకాలంలో మందులు అందుతున్నదీ లేనిదీ ఆరా తీశారు. అనంతరం తోణాం గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. మలేరియాతో బాధపడుతున్న పిల్లల వివరాలు, వారికి మందులు అందుతున్న తీరు, డార్మెటరీలో దోమతెరల వినియోగంపై వాకబు చేశారు. తర్వాత పీహెచ్‌సీలో రికార్డులు పరిశీలించి.. అవసరమైన సలహాలు ఇచ్చారు. తోణాం గ్రామస్థులకు దోమతెరలు వాడే విధానంపై అవగాహన కల్పించారు. వారి వెంట జిల్లా మలేరియా అధికారి సూర్యనారాయణ, సబ్‌ యూనిట్‌ అధికారి ఈశ్వరరావు, ఆదినారాయణ, వైద్యాధికారి మధుసూదనరావు తదితరులు ఉన్నారు.

Updated Date - Oct 05 , 2026 | 11:07 PM