Share News

Alert Diseases సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తం

ABN , Publish Date - Feb 02 , 2026 | 11:54 PM

Alert on Seasonal Diseases సీజనల్‌ వ్యాధులపై గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని, పలు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో భాస్కరరావు సూచించారు. కుసిమి పీహెచ్‌సీ పరిధిలో ఉన్న మల్లి, దారిమల్లి, శిలగాం గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించారు.

Alert Diseases సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తం
శిలగాం గ్రామంలో గిరిజనులతో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో

సీతంపేట రూరల్‌,ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): సీజనల్‌ వ్యాధులపై గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని, పలు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో భాస్కరరావు సూచించారు. కుసిమి పీహెచ్‌సీ పరిధిలో ఉన్న మల్లి, దారిమల్లి, శిలగాం గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలతో మాట్లాడారు. డోర్‌టుడోర్‌ సర్వే జరిగిందా లేదా?, ఆశ, ఏఎన్‌ఎం, హెల్త్‌ వర్కర్లు గ్రామాల్లో సేవలు అందిస్తున్నారా? లేదా అని వారిని అడిగి తెలుసుకున్నారు. కాచి వడబోసిన నీటిని తాగాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనారోగ్య సమస్యలొస్తే సమీపంలో ఉన్న పీహెచ్‌సీలను ఆశ్రయించి వైద్యసేవలు పొందాలన్నారు. గ్రామస్థాయిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు. ఈ పరిశీలనలో డిప్యూటీ డీఎంహెచ్‌వో విజయపార్వతి, కుసిమి పీహెచ్‌సీ వైద్యాధికారి చాందిని, వైద్య సిబ్బంది ఉన్నారు.

Updated Date - Feb 02 , 2026 | 11:54 PM