సైబర్ మోసాలపై అప్రమత్తం: ఎస్పీ
ABN , Publish Date - Feb 20 , 2026 | 12:03 AM
జిల్లాలోని ప్రజలు అప్రమత్త తతో వ్యవహరిస్తే, సైబర్ మోసాల నుంచి రక్షణ పొందవచ్చునని ఎస్పీ దామో దర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
విజయనగరం క్రైం, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రజలు అప్రమత్త తతో వ్యవహరిస్తే, సైబర్ మోసాల నుంచి రక్షణ పొందవచ్చునని ఎస్పీ దామో దర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్ మోసాల పట్ల అవగాహన, అప్రమత్తతే ఆయుధమని.. ఓటీపీలను, వ్యక్తిగత సమాచారం, పాస్‌వర్డ్‌లను ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్ ఎత్తడం, అనుమానాస్పద లింక్‌లను ఓపెన్ చేయడం చేయరాదన్నారు. ఇటీవల ట్రాఫిక్ చలానా పేరుతో లింక్‌లు, ఏపీకే ఫైల్స్ పంపి అమాయక ప్రజలను సైబర్ నేర గాళ్లు దోచుకుంటున్నారని ఆయన తెలిపారు. మొబైల్ ఫోన్లకు కొన్ని లింకులు, క్యూఆర్ కోడ్స్, సందేశాలు, ఈ మెయిల్స్‌ని పంపి, వారి బ్యాంకు ఖాతాల సొమ్ము కాజేస్తున్నారన్నారు. సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్ చేసి ‘మీరు మాదకద్రవ్యాల కేసులో ఇరుక్కున్నారు.. డిజిటల్ అరెస్టు చేస్తున్నాం.. ఎన్‌ఫోర్సుమెంటు, సీఐడీ, సీబీఐ అధికారులం’ అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఎవరైనా ఈ తరహాలో కాల్స్ వస్తే 100/112కి సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు.