Share News

ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం విజయవంతం

ABN , Publish Date - Aug 03 , 2026 | 11:51 PM

అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవంలో కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. సోమవారం కలెక్టర్‌ రామసుందరరెడ్డిని ఆయన చాంబర్లో అభినందించారు.

  ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం విజయవంతం
రామసుందర్‌రెడ్డిని అభినందిస్తున్న కొండపల్లి శ్రీనివాస్‌ :

విజయనగరం ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవంలో కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. సోమవారం కలెక్టర్‌ రామసుందరరెడ్డిని ఆయన చాంబర్లో అభినందించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ విమానాశ్రయ ప్రారంభోత్సవ షెడ్యూల్‌ విడుదలైన నాటి నుంచి పకడ్బందీగా ఏర్పాట్లు చేశారని, కృతనిశ్చయంతో విధులు నిర్వ హించారన్నారు. అధికారులతో సమన్వయం చేయ డంతోనే ఆటంకాలు లేకుండా విజయవంతంగా ప్రారంబోత్సవ కార్యక్రమాన్ని పూర్తిచేయగలిగా మని కలెక్టరు రామసుందర్‌రెడ్డిని ప్రశంసించారు.

Updated Date - Aug 03 , 2026 | 11:51 PM